(గద్వాల)
చీరల తయారీకి ప్రఖ్యాతి చెందిన గద్వాలలో ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. జాగృతి జనంబాటలో భాగంగా గద్వాల పట్టణంలో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడి చీరలు, వస్త్రాలు నేయడం గురించి తెలుసుకున్నారు. వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరాతీశారు
















