జాగృతి జనంబాటలో భాగంగా సోమవారం రాత్రి  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు.