జాతీయ జెండా ఎగురవేసిన జాగృతి అధ్యక్షురాలు | బంజారాహిల్స్, తెలంగాణ జాగృతి కార్యాలయం

బీసీ కులగణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త మోసానికి తెర లేపిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ భావనతో, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ముందుకు కదలి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆమె మాట్లాడారు. బీసీల కోసం యుద్ధ భేరి మోగించబోతున్నామని కవిత ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై తప్పుడు లెక్కలు చెప్పిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసే కులగణనపై మనం నమ్మకం పెట్టుకున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కులగణన డాక్యుమెంట్ లో బీసీ అనే కాలమ్ ఎక్కడ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను అవమానపరిచిందని చెప్పారు. 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసినట్లు ఇప్పుడు 2026లో బీజేపీ బీసీలను మోసం చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి సమాజానికి స్పూర్తిగా నిలవాలని చెప్పారు. బీసీ ఉప కులాలను లెక్కించాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తోందన్నారు. ఇందుకోసమే బీసీ మేధావులతో మాట్లాడుతున్నానని వెల్లడించారు. జనవరి 29 న బీసీలు, బీసీ ఉప కులాలు, సంచార జాతులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కులం, ఉప కులం ఎంత శాతం ఉంది అనే దానిపై డాక్యుమెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి తరపున నివేదిక ఇస్తామని కవిత చెప్పారు.

Telangana Jagruthi Chief Kavitha Raises Voice Against BC Caste Census “Fraud”