ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు.

ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా లేదని, ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణను పూర్తి చేసి కేసును కంక్లూడ్ చేయాలని సూచించారు. కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కచ్చితంగా చాలా బాధాకరమైన అంశమని చెప్పారు.

కానీ దాని పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అన్నది వేచి చూడాలని కవిత అన్నారు.