(హైదరాబాద్)
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 12న బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ జరగనుంది. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోస్టర్ ఆవిష్కరించారు. అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.










