(బేగంపేట)
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బేగంపేట ప్రజా భవన్ ఎదుట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రజా భవన్ లో ప్రజావాణి విజ్ఞప్తుల దినం సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో మహిళలు ఈ కార్యక్రమం చేపట్టారు. రేవంత్ (Revanth reddy) సర్కార్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో మహిళలంతా ప్రజాభవన్ గేట్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఒక్కసారిగా జరిగిన ఈ ధర్నాతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.









