తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుపతికి బయల్దేరారు. ఈ రోజు(మార్చి 5న) మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయలుదేరుతారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.








