(హైదరాబాద్)
పేదల కోసం చేస్తున్న దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేసినా పట్టుదల ఉంటే అరెస్టులు ఆందోళనను ఆపలేవని నిరూపించారు తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత. ఖమ్మం పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించినా జాగృతి కార్యాలయంలో తన నిరవధిక నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్ లో సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు కవితను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని ఖమ్మం పోలీసులు హైదరాబాద్ లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి తరలించారు. జాగృతి కార్యాలయానికి కవితను తరలించారని తెలిసి వందలమంది ఇక్కడికి చేరుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు కూల్చివేసిన చోటే ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహారదీక్ష కోనసాగిస్తున్నారు. కవిత దీక్షకు మద్దతుగా జాగృతి నాయకులు కూడా ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు












