శతాబ్దాల క్రితమే బహుజన వాదం ఎత్తుకున్న సర్వాయి పాపన్న

పాపన్న స్ఫూర్తితో బహుజనుల సేవలో కవితక్క

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి కార్యక్రమంలో మాట్లాడిన ఎదురుగట్ల సంపత్ గౌడ్

(హైదరాబాద్)

బీసీ, ఎస్సీ, ఎస్టీలపై అగ్రవర్ణాల పెత్తందారీ వ్యవస్థను నాలుగు శతాబ్దాల క్రితమే ఎదురించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న అని తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ అన్నారు. 8 ఏళ్ల వయసులోనే ఆయనలో తిరుగుబాటు తత్వం ఉండేదని చెప్పారు. అగ్రవర్ణాల ఆగడాలను తట్టుకోలేక బహుజనవాదంతో పెద్ద సైన్యాన్నే తయారు చేశారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో జాగృతి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ మాట్లాడుతూ బహుజనవాదంతో 12 వేలమంది సైన్యంతో గొల్కొండ కోటకు పాపన్న రాజు అయ్యారని అన్నారు. ఢిల్లీ కోటను కూడా గెలుచుకోవాలని ఆయన ప్రయత్నించటంతో కుట్ర చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చరిత్రను మన వారికి తెలియకుండా లండన్ మ్యూజియంలో భద్రపరిచారని చెప్పారు. ఆయన చరిత్ర ఇటీవలే మనకు తెలిసిందని గుర్తు చేశారు. సర్దాయి పాపన్న గౌడ్ మాదిరిగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేయాలన్న సంకల్పంతో కవితక్క ముందుకు వస్తున్నారని అన్నారు. ఆమె నాయకత్వంలో సర్దార్ పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.