ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు

వంద రూపాయల చీర ఇచ్చి వాళ్లను కోటీశ్వరులను చేశామంటూ సీఎం అబద్దాలు చెబుతున్నారు

వెలుగుమట్ల, పరిగి, ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చాం

రిపోర్ట్ తెప్పించుకొని న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

డీ ఎస్పీ అధ్యక్షుడు విశారదన్, వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిసి  తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కవిత సమావేశం 

(లోక్ భవన్, హైదరాబాద్)

రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని అన్నారు. ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్,  వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిసి మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సమావేశం అయ్యారు. వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆలైన్ మెంట్ మార్పులు, రాయగిరిలో ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ, కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేదల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న  ప్రయత్నాలను గవర్నర్ కు వివరించారు. అనంతరం లోక్ భవన్ బయట  మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ పేదలకు చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని గవర్నర్ ను కోరామని చెప్పామన్నారు. తాము చెప్పిన అంశాలను గవర్నర్ ఓపికతో విన్నారని, కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 

Kavitha Meets Governor Over Triple R Victims

రేవంత్ రెడ్డి కర్కోటక సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల పట్ల అత్యంత కర్కోటకంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కవిత మండిపడ్డారు. కేవలం వంద రూపాయల చీర ఇచ్చి ఆడవాళ్లను కోటీశ్వరులు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. వెలుగుమట్లలో ఆడబిడ్డ నవ్య ఇల్లు కూలగొట్టి వారికి మనశ్శాంతి లేకుండా చేశారన్నారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చుతుంటే ఓ మహిళకు గర్భస్రావం అయ్యిందని..వాళ్ల భర్త రోదన ఇప్పటికీ మాకు వినబడుతూనే ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడని చెప్పారు. కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయటం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి విమానంలో ఢిల్లీకి వెళ్తూ ఫ్లైట్ నుంచి చూస్తే కల్లాల్లో ధాన్యం కనిపిచంటం లేేదేమో అన్నారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. 

గవర్నర్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది 

ఖమ్మంలోని వెలుగుమట్ల, పరిగిలోని ఇండస్ట్రియల్ పార్క్ కోసం ల్యాండ్ కోల్పోతున్న బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల కోసం తాము పోరాడుతున్న విషయం తెలిసిందేనని కవిత గుర్తు చేశారు. వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో బాధితులను తీసుకెళ్లి గవర్నర్ ను కలిశామన్నారు. ధర్మసమాజ్ పార్టీ, టీఆర్ఎస్ కలిసి చేసిన పోరాటంతో ఈ అంశాల్లో పాక్షికంగా విజయం సాధించామన్నారు. వెలుగుమట్ల లో భూ బాధితులకు అక్కడే ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటంతో పాటు పరిగి, ట్రిపుల్ ఆర్ సేకరణ ను తాత్కాలికంగా ఆపేశారని గుర్తు చేశారు. ఐతే పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే గవర్నర్ ను కలిసి ఆయనకు అన్ని వివరాలు అందజేశామన్నారు. ట్రిపుల్ ఆర్ ఆలైన్ మెంట్ ను నాలుగు సార్లు మార్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆశ్చర్యపోయారన్నారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖ కూడా గవర్నర్ కు అందజేశామన్నారు. తాము చెప్పిన అంశాలను కూలంకషంగా విన్నారని కవిత చెప్పారు. ఆయా అంశాలకు సంబంధించి రిపోర్ట్ తెప్పించుకోని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. గవర్నర్ కచ్చితంగా న్యాయం చేస్తారన్న నమ్మకంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇచ్చి ఆ తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ పోరాట బాట పడతామని తేల్చి చెప్పారు.

లక్ష ఎకరాలు కొల్లగొట్టే కుట్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లక్ష ఎకరాల భూమి కొల్లగొట్టేందుకు పథకం పన్నాడని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆరోపించారు. ఫోర్త్ సిటీ, ట్రిపుల్ ఆర్, పరిగి ఇండస్ట్రీయల్ కారిడర్, వెలుగుమట్ల లో భూ దోపిడీకి ప్లాన్ వేశారన్నారు. దీని పై ఎవరికి చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇక చివరకు రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ ను కలిసి ఆయనకు విన్నవించామన్నారు. కచ్చితంగా ఆయన న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. లేదంటే తర్వలోనే పెద్ద ఎత్తున నిరసన తెలిపే కార్యక్రమాలు చేస్తామన్నారు. లక్ష ఎకరాలు కాపాడేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు, అవసరమైతే మహసభ ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.