రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటన
భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు.. వేములవాడ ఆలయ అభివృద్ధి పరిశీలన
చందుర్తి మండలం సనుగులలో అమరుల యాదిలో కార్యక్రమంలో పాల్గొననున్న టీఆర్ఎస్ చీఫ్
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు వేములవాడకు చేరుకొని భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఉదయం 10 గంటలకు వేములవాడ మార్కెట్ రోడ్డులోని మున్నూరుకాపు సంఘ భవనంలో మీడియాతో మాట్లాడుతారు. ఉదయం 11 గంటలకు చందుర్తి మండలం సనుగుల గ్రామంలో నిర్వహించే అమరుల యాది కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.








