లిక్కర్ కేసు కొట్టేసిన రౌస్ అవెన్యూ కోర్టు
సత్యమే గెలిచిందన్న కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించినట్లైంది. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేసినట్లు సాక్షాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో తెలంగాణ జాగృతి కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కోర్టు తీర్పు పట్ల మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత సంతృప్తి వ్యక్తం చేశారు. సత్యమే గెలిచిందని స్పష్టం చేశారు. కష్టకాలంలో తన వెంట నిలిచిన కుటుంబసభ్యులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు.








