నాగర్ కర్నూల్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బాధిత కుటుంబానికి ఫోన్ లో పరామర్శ
(హైదరాబాద్)
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
జాతరకు వెళ్లిన రజక దంపతులు గణేశ్, మౌనిక, రెండు నెలల వారి పసి బిడ్డ, తల్లి, చెల్లిపై దాడి చేయగా ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. పాప తల్లి, కుటుంబ సభ్యులతో కవిత ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు కవితకు చెప్పారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎస్పీకి కవిత ఫోన్ చేశారు.. కుమ్మెర జాతరలో కులవివక్షతో రజక కుటుంబం పై దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు.








