స్థానికంలో సత్తా చాటేలా కవిత వ్యూహ రచన
పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు
గ్రేటర్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పార్టీ శ్రేణుల సమాయత్తం
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమైన కవిత సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. రాబోయే జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు పార్టీ నేతలు, క్యాడర్ ను సమాయత్తం చేయడంతో పాటు రాబోయే కాలంలో పార్టీ నేతలు, క్యాడర్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. నిజామాబాద్, కొడంగల్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలపై ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు.. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన తర్వాత తెలంగాణ రక్షణసేన స్పందించిన తీరుతోనే ప్రభుత్వం దిగివచ్చిందని కవిత గుర్తు చేశారు.
ఏళ్లకేళ్లుగా రిమ్స్ హాస్పిటల్ ను పట్టించుకోని ప్రభుత్వం తక్షణ చర్యల కోసం రూ.11 కోట్లు రిలీజ్ చేసిందని, కలెక్టర్ రిమ్స్ హాస్పిటల్ సమస్యలపై రివ్యూ చేసి చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి నివేదించారని వెల్లడించారు. తాను ఆస్పత్రిని విజిట్ చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన తర్వాతనే ప్రభుత్వం దిగివచ్చి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా తెలంగాణ రక్షణసేన నాయకులు, కార్యకర్తలు తక్షణం స్పందించి వారికి అండగా నిలవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లు, సిద్దిపేట సహా ఇతర మున్సిపాలిటీల్లో పోటీ చేసి సత్తా చాటాలని నేతలకు సూచించారు.
బుధవారం వరకు..
ఉమ్మడి జిల్లాల వారిగా నిర్వహిస్తున్న సమావేశాలు బుధవారం వరకు కొనసాగనున్నాయి.. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, బుధవారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో కవిత సమావేశం కానున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.








