గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరుగా నమోదు చేసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటరుగా తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత తన ఓటు నమోదు చేసుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదుపత్రం ఫిల్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానాల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని యువతకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రశ్నించే గొంతుక అని.. తమ పార్టీ నుంచి రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో మంచి వాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా యువకులు, నిరుద్యోగులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.