శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం రేవంత్ విఫలం
హైదరాబాద్ లో ఒకే రోజు ఆరుగురి హత్య అమానుషం
ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది?
నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మరణం బాధాకరం
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఆరుగురి హత్య జరగడం అమానుషమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఘోరం జరుగుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ సంఘటనకు సీఎం, హోమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేషేరు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. నెరేళ్ల బాధితుడు గంధం గోపాల్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
సీఎం రిజైన్ చేయాలి
హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఆరుగురి హత్య జరిగటం ఘోరమని కవిత అన్నారు. ఫోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు ఇంత ఘోరానికి పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. నిందితుడు 17 ఏండ్ల బాలికపై అత్యాచారం చేసి చంపటంతో పాటు ఆ తర్వాత బాలిక తల్లి, నాన్నమ్మను కిరాతకంగా హత్య చేశాడని చెప్పారు. ఆ తర్వాత తన భార్య పిల్లలను కూడా చంపేయటం దారుణమన్నారు. ఇన్ని హత్యలు జరుగుతుంటే నిఘా వ్యవస్థ, పోలీసులు ఈ ఘోరాన్ని ఆపకపోవటం దారుణమన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నిందితుడు పరారీలో ఉండమంటే అది ప్రభుత్వం చేతగాని తనమేనని విమర్శించారు. ఆరుగురి హత్యలకు హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.
గంధం గోపాల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం
నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కవిత అన్నారు. 2017లో నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఘటనలో పోలీసుల చిత్రహింసలకు గురైన ఆయన, గత పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా వారికి న్యాయం చేయలేదని మండిపడ్డారు. అటు బాధితులకు ఎన్నో హామీలు ఇచ్చి నేడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కూడా మాట నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంధం గోపాల్ మృతి కవిత ప్రగాఢ సంతాపం తెలియజేశారు. త్వరలోనే వారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శిస్తానని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామన్నారు.








