జాగృతి జనంబాటలో భాగంగా నగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పర్యటించిన  జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం రాత్రి కల్వకుర్తి నియోజకవర్గంలోని సలార్ పూర్ తండాలో తెలంగాణ జాగృతి యూత్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి రాథోడ్ నివాసంలో బస చేశారు. ఇప్పటికే కవిత 16 జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు.. తన పర్యటన లో దళిత, ఆదివాసీ, బహుజన నాయకుల నివాసాలు, తెలంగాణ జాగృతి నాయకుల నివాసాల్లో బస చేశారు. తండాలో బస చేసి గిరిజకుల సమస్యలు దగ్గరి నుంచి చూసి అవగతం చేసుకోనున్నారు.


బస చేసిన గ్రామంలో కవితకు ఘనస్వాగతం