మొహర్రం పండుగ ఏర్పాట్లలో అంత నిర్లక్ష్యమా?
-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్):
మొహర్రం పండుగ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మొహర్రం మాసానికి ఇంకా 12 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ
ఏర్పాట్ల ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ నిర్వహణ ఏర్పాట్ల కోసం సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవటం శోచనీయన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ‘బీబీ కా ఆలమ్’ ఊరేగింపులో పాల్గొనే ఏనుగును తెప్పించే ప్రక్రియ కూడా ప్రారంభించలేదన్నారు. అటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న 11,836 ఆషూర్ ఖానాలకు ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. మొహర్రమ్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన సమీక్షా సమావేశాలు నిర్వహించి, ఏర్పాట్లు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
With just 12 days left for the holy month of Muharram, it is deeply concerning that the State Government has not initiated any visible preparations.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 4, 2026
No review meetings have been conducted. Even crucial arrangements including the elephant for the historic Bibi Ka Alam procession…








