తెలంగాణ జాగృతి సాహిత్య అధ్యయన కమిటీ సభ్యులు దేవేందర్ ఆదివారం తమ పరిశీలన నివేదికను స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎల్.రూప్ సింగ్, లోక రవిచంద్రకు అందజేశారు. తెలంగాణలో సాహితీ వికాసం పై అధ్యయనం చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ సాహితీ వేత్తలను సంప్రదించారు. తెలంగాణలో సాహిత్య ధోరణి, సామాజిక అభివృద్ధిలో సాహిత్య ప్రభావం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేశారు. తాము పరిశీలించిన అంశాలపై రూపొందించిన నివేదికను స్టీరింగ్ కమిటీకి అందించారు.








