తెలంగాణ జాగృతి ఎస్సీ అధ్యయన కమిటీ సభ్యులు తమ నివేదికను శనివారం స్టీరింగ్ కమిటీకి అందించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవితక్క ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి ఎస్సీలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక తదితర అన్ని విషయాల పైన ఎస్సీ కమిటీ సభ్యులు ఎస్. కృష్ణవేణి, జాడి శ్రీనివాస్, డాక్టర్ పర్లపల్లి శ్రీశైలం, దండెం ఆనంద్ సమగ్ర అధ్యయనం చేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు, వివిధ ప్రాంతాల్లో నివసించే వారిని కలిసి సమగ్ర సమాచారం సేకరించారు. తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎల్. రూప్ సింగ్, ఇస్మాయిల్, మంచాల వరలక్ష్మికి నివేదికను సబ్మిట్ చేశారు.








