తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి భవానీ వేముల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని పలు బస్తీలను, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలను (ఎస్హెచ్జీలు) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలను కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, సంఘాల నిర్వహణ విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలు, భవిష్యత్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశాల్లో మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, సంఘాలను మరింత బలోపేతం చేయడం అవసరమని పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భావాని వేములతో పాటు కుసుమ రాజిత, రమాదేవి, పద్మమ్మ, మురుగేష్, మంజు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళల సంక్షేమానికి ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.









