బీసీ అధ్యయన కమిటీ సభ్యులు కోల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారి లావణ్య శనివారం బీసీ ఉద్యమ నాయకుడు ధర్మ రక్షక్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ ను కలిశారు. విశారదన్ బీసీలకు రాజకీయంగా రాజ్యాధికారం అనే విషయాన్ని వివరించారు ఏ విధంగా పోరాడితే రాజ్యాధికారం వస్తుందో చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలకు ఏ విధంగా న్యాయం జరగాలి, బీసీలకు ఎలాంటి పథకాలు అయితే అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని కూలంకషంగా వివరించారు. విద్యా, ఉద్యోగ విషయాల్లో గతంలో జరిగిన అన్యాయం, ప్రస్తుత పరిణామాలను చెప్పారు. 

 మధ్యాహ్నం రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్ ను జాగృతి బృందం కలిసింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ గా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా ఆయన బీసీల కోసం కృషి చేశారు. బీసీల పట్ల గత ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ఉమ్మడి ప్రభుత్వం విధానాలు, ప్రస్తుత  బీసీల, ఎంబీసీల, సంచార జాతుల విధివిధానాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని ఏ విధంగా వారి అభివృద్ధి చెందుతారు వారికి ఏ విధమైన పథకాలను పెట్టాలి అనే విషయం పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది.

BC Jagruthi delegation meeting BC leaders in Telangana