జాగృతి బీసీ అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో తాము చేసిన అధ్యయనం గురించి తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్, ఎం. వరలక్ష్మి, లోక రవిచంద్రకు శుక్రవారం తెలంగాణ జాగృతి భవన్లో కలిసి వివరించారు. నివేదిక రూపొందించడానికి ఎవరెవరిని కలిశారు, ఏమేమి చర్చించారో స్టీరింగ్ కమిటీ సభ్యులకు కోల శ్రీనివాస్, బండారి లావణ్య తెలిపారు. పూర్తిస్థాయిలో శనివారం నాటికి నివేదిక సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, జాగృతి వైస్ ప్రెసిడెంట్  కోలా శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారి లావణ్య పాల్గొన్నారు.