తెలంగాణలో ప్రసిద్ధి పొందిన ఆదివాసీల నాగోబా జాతరలో పాల్గొనడానికి తెలంగాణ జాగృతి బృందం వెళ్లింది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తరుపున వసంత పంచమి రోజున ఆదివాసుల ఆరాధ్య దైవమైన నాగోబా దేవతకు పసుపు కుంకుమ పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జాగృతి ప్రతినిధి బృందంలో మంచాల వరలక్ష్మి, పడాల మనోజ, లొకిని రాజు, బండారి లావణ్య, గోపు సదానందం ఉన్నారు.