సెన్సస్ డాక్యుమెంట్ లో ఓబీసీ కేటగిరి చేర్చే వరకు ఉద్యమిస్తాం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు – రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎంపి

కులగణనలో ప్రతి వర్గానికి ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ జాగృతి అధినేత్రి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జనాభా లెక్క అంటే అందులో అందరం ఉండాలని కోరుకుంటామని, బీసీలను, ఓసీలను, ఎంబీసీలను అందరినీ కూడా కచ్చితంగా గుర్తించాలని సూచించారు. బంజారాహిల్స్ ఖాజా మాన్షన్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం జరిగిన జాతీయ జనగణనలో కులగణన-సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు జనగణన, కులగణన చేయబోతున్న తీరు వివరించిన కవిత ముగింపు ప్రసంగంలో బీసీల గణన వారికి అన్యాయం కాకుండా చేయాలని కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

Kavitha OBC EBC census demand Telangana

 ఫస్ట్ రికగ్నైజేషన్..నెక్స్ట్ రిజర్వేషన్ -కల్వకుంట్ల కవిత

జాతీయ జనగణనలో భాగంగా చేయబోతున్న కులగణనలో ప్రత్యేకంగా బీసీల గణన చేయకపోవడం దారుణం. దీని కారణంగా మళ్లీ ఎంబీసీ, డీఎన్టీ, ఓబీసీ కులాలకు సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఉంటుంది. కులగణన అంటే కులం కేటగిరీతో పాటు సబ్ కేటగిరీ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్క కులాన్ని గౌరవించినట్లు అవుతుంది. కానీ గెజిట్ ఇచ్చిన తర్వాత మేము క్షుణ్ణంగా పరిశీలించాం. కులగణనలో బీజేపీ తీవ్రమైన కుట్ర చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల విషయంలో రాజ్యాంగ రక్షణ ఉండటంతో వారికి అన్యాయం జరగటం లేదు. కానీ బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలు రక్షణ లేకుండా పోయారు. ఈ దేశంలో 4 వేల కులాలు ఉన్నాయి. అదర్స్ అని ఆప్షన్ పెడితే వారిని ఏ కులంగా భావించాలి. అన్ని కులాలను మీరు ఒకటే విధంగా పెడితే ఏ విధంగా లెక్క తేలుతుంది. 2011 లో రూ. 4500 కోట్లతో కాంగ్రెస్ జనగణనలో ఏ తప్పు చేసిందో బీజేపీ కూడా అదే చేస్తున్నది. 11 వేల కోట్ల రూపాయలతో చేపట్టబోయే జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతున్నది. ఫస్ట్ రికాగ్నైజేషన్, తర్వాత రిజర్వేషన్ అని మేము అంటున్నాం. ముందు మమ్మల్ని గుర్తిస్తేనే కదా? మాకు రిజర్వేషన్లు ఇచ్చేది? మమ్మల్ని గుర్తించటమే లేదంటే మేమంటే మీకు లెక్కలేనట్లే? ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కులగణన చేయటం సాధ్యం కాదా? పద్మశాలి కులాన్నే తీసుకుంటే అందులో 23 ఉపకులాలు ఉన్నాయి. అన్ని రాస్తే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా మిగతా అన్ని కులాల్లో కూడా ఉపకులాలు ఉంటాయి. అంటే కేవలం కులాల పేర్లతో పంచాయితీ పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి ఫేజ్ లో ఇండ్ల సర్వే చేస్తున్నారు. ఆ తర్వాత ఏడాదికి కులగణన చేస్తారు. ఈ ఏడాదిలో మనం పోరాటం చేస్తేనే ఓబీసీ, బీసీ, ఈబీసీ కాలం యాడ్ అవుతుంది. మనం ఇప్పుడు పోరాటం చేయకపోతే మళ్లీ పదేళ్లు మనకు సర్టిఫికెట్లు రావు. ఇది ఒక్కరి మీద కాదు అందరి మీద జరుగుతున్న కుట్ర. ఈ విషయాన్ని ముందుగా  గ్రహించి జాగృతి తరఫున ప్రజలను జాగృతం చేస్తున్నాం. జరుగుతున్న కుట్రను గమనించాలని నేను చేతులు జోడించి తెలంగాణ సమాజాన్ని కోరుతున్నా. ఈ అంశాన్ని మనం ఎక్కడ ఉన్నా సరే చర్చకు పెట్టాలి. ముఖ్యంగా ఇది రాజకీయ అజెండా అయినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు భయపడుతాయి. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో దీన్నే అజెండా చేద్దాం. సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చెబుతున్నా…డేటా అనేది మనకు గౌరవం. ఆ గౌరవాన్ని మనకు లేకుండా చేస్తున్న కుట్రను మనం గుర్తించాలి. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఈ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదు. ఇది అన్యాయమని తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నా? మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై మాట్లాడకుండా పార్టీలు దాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. అటు ఎస్ఆర్సీ తెచ్చి మైనార్టీలు ఓట్లు వేయకుండా చేస్తున్నారు. కులగణనన విషయంలో మైనార్టీలు భయపడుతున్నారు. వారు ఏ మతమైనా సరే వారికి మనం అండగా ఉండాలి. జనాభా గణన ద్వారా అన్ని వర్గాలకు వారి జనాభాకు అనుగుణంగా అవకాశాలు రావాలి. అందుకే జాగృతి తరఫున మేము ముందుకు వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేద్దాం. ఈ సమావేశం సక్సెస్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు.

జాతీయ జనగణనలో కులగణన-సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల కామెంట్స్ ,కవితకు మద్దతుగా ఉంటాం -అశోక్, పోటీ పరీక్షల నిపుణులు

రాజ్యాంగ బద్దంగా ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు ఉండటంతో వారికి  న్యాయం జరుగుతోంది. ఓసీలకు డబ్బులు ఉన్నాయి. వాళ్లు ఓట్లు, పదవులు, సీట్లు కొంటున్నారు. కానీ బీసీలు మాత్రం వెనకబడి పోయారు. వారికి రిజర్వేషన్లు లేవు, డబ్బు లేదు. 52 శాతం ఉన్న బీసీలకు ఎస్సీ, ఎస్టీలకు ఎంత రిజర్వేషన్లు ఉన్నాయో అంతే వస్తున్నాయి. అంబేడ్కర్ 1937 లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చేలా కృషి చేశారు. కానీ ఇవ్వాళ బీసీల సంఖ్య ఎంత ఉందంటే దేశంలో లెక్కలు లేవు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన చేయలేదు. రాహుల్ గాంధీ కులగణన అన్నారు. కానీ మధ్యలోనే చేతులెత్తేశారు. కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో సీరియస్ గా లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశ వ్యాప్తంగా మీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఎందుకు జరగటం లేదు. కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయటం లేదు. కేవలం 3 వేల కోట్ల కోసం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అసలు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ లో మూడు వేల కోట్లు అంటే ఎంత? పార్టీ తరఫున బీసీలు ఓడిపోయే సీట్లను వారికి ఇస్తున్నారు. ఇవ్వాళ అగ్రకులానికి చెందిన కవిత బీసీల సమస్యపై మాట్లాడటానికి ముందుకు రావటం సంతోషం. వారి పార్టీలో బీసీలకు 56 శాతం వాటా ఇస్తామని చెప్పాలి. తమ పార్టీ అగ్రకులాలది కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలదని నిరూపించాలి. అప్పుడు కచ్చితంగా మేము కవితను దగ్గరుండి గెలిపించుకుంటాం. దేశంలో మహిళా నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. ఇక బీసీల మహిళల ప్రాతినిధ్యం కూడా తక్కువగా ఉంది. తెలంగాణలో మహిళలను ప్రభావితం చేసే బలమైన నాయకురాలు కవిత గారే. 

అగ్రకులాలకు అడగకుండానే ఈడ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చారు. దీంతో 74 మార్కులు వచ్చిన బీసీ డీ మహిళను కాదని 64 మార్కులు వచ్చి ఓసీ మహిళకు జాబ్ వచ్చింది. ఓసీ జనాభా 10 శాతం ఉంటే వారికి 40 శాతం ఉద్యోగాలు వస్తున్నాయి. 

మొన్నటి గ్రూప్ వన్ ఉద్యోగాల్లో 35 శాతం వారికే వచ్చాయి. అందుకే అన్ని కులాలకు వారి జనాభా ప్రకారం వాటా రావాలి. 

ఆ విధంగా కవిత కృషి చేస్తే వారికి కచ్చితంగా మేము అండగా ఉంటాం.

caste census round table meeting Hyderabad

మహిళా బిల్లుకు బీసీలు మద్దతుగా రాలేదు -సంధ్య, పీఓడబ్ల్యూ

మండలి కమిషన్ చుట్టు ఉన్న అధిపత్య, కుల వర్గ రాజకీయాలు చూశాం. మండల్ కమిషన్ తెచ్చినందుకు దేశ ప్రధానినే పడగొట్టిన కుల వ్యవస్థ మన దగ్గర ఉంది. బీసీలు, మహిళలు ఈ దేశంలో తీవ్రంగా అన్యాయమయ్యారు. నిర్ణయాధికారంలో సమభాగం అనే నినాదాన్ని తొక్కివేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం చర్చ జరిగితే ఆ బిల్లును బీసీ నాయకులే చించేశారు. ఓబీసీ మైనార్టీ సవరణ లేకుండా ఆ బిల్లును బుట్టదాఖలు చేశారు. మహిళ బిల్లు కూడా జనగణన తో ముడిపడి ఉంది. జనగణన అద్దమైతే అసమానతలు, ఆర్థిక దోపిడీకి ప్రతిబింబం కులగణన. పాలకులకు ఆధిపత్య స్వభావం ఉంటుంది కనుకే ఇన్నాళ్లు కులగణన జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు మేము కులగణన చేస్తామని చెబుతున్నారు. కానీ దాన్ని నమ్మవద్దు. ఇప్పటికైనా మనకు జరిగిన అన్యాయంపై జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మంచి విషయాన్ని అజెండాగా తెచ్చినందుకు కవితను అభినందిస్తున్నా. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎప్పుడు కూడా మహిళ బిల్లు వచ్చినప్పుడే వచ్చింది. 1996 లో మహిళ బిల్లు ఓబీసీ మైనార్టీ సవరణ చేయాలని మేము డిమాండ్ చేశాం. మహిళా బిల్లు విషయంలో మేము డిమాండ్ చేస్తే అప్పుడు బీసీ సంఘాలు ఎవరూ మాకు అండగా రాలేదు. ఓబీసీ మైనార్టీ సవరణ చేస్తూ మహిళా బిల్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జనాభాలో ఎంత వాటా ఉందో అంతే స్థాయిలో వారికి హక్కు ఉండాలి. బ్రహ్మణ అధిపత్యంపై పోరాటం చేయకపోతే కులగణన సరిగా జరగదు. నిష్పాక్షిక ధోరణితో ఒక సామాజిక లక్ష్యంతో మనం పోరాటం చేయాలి. రాజ్యాధికారం అనేది అందరికీ దక్కే విధంగా ముందుకు వెళ్లాలి.

ఆధిపత్య కులాల కుట్ర -గోవర్ధన్, న్యూ డెమోక్రసీ

90 ఏళ్ల తర్వాత కూడా బీసీ కులగణన జరగకపోవటం బాధాకరం. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలను కావాలనే అణగదొక్కుతున్నారు. మేమెంతో మాకు అంత అని అంబెేడ్కర్ గతంలోనే చెప్పారు. కులగణనలో ఇచ్చిన 33 అంశాల్లో ఇతరులు అనే కాలమ్ ప్రమాదకరంగా ఉంది. దాన్ని జాగృతి సంస్థ గుర్తించి పోరాటం చేయటం సంతోషకరం. మనం ఇప్పటి నుంచే ఈ అంశంపై పోరాటం చేయాల్సి ఉంది. లేదంటే నష్టపోతాం. ఈ అంశంపై కవిత చేస్తున్న ప్రయత్నానికి మేము మద్దతిస్తున్నాం. గతంలో మండల్ కమిషన్ ను అమలు కాకుండా ఆధిపత్య కులాలు ప్రయత్నం చేశాయి. అందుకే మనందరం వాస్తవాలు తెలుసుకొని వారి ప్రయత్నాలు ధిక్కారించాలి.

పోరాడి సాధించే కులం -మన్నారం నాగరాజు, తెలంగాణ లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు

బ్రిటీష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ కూడా ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఆర్టికల్ 332 ను మళ్లీ చూసి దాని కిందకు మమ్మల్ని తేవాలి. ఈ అంశంపై మనం బీజేపీని అడగాల్సి ఉంది. ఇప్పుడు కులగణనలో అదర్స్ అని పెడితే మమ్మల్ని ఎందులో కలుపుతారు. కుక్కలు, నక్కలు, పిల్లులు మాదిరిగా మనం తిరగాలా? మనం పోరాడి మన రిజర్వేషన్లు సాధించుకునే బీసీలం.

మా లెక్క తేలాలి-గుజ్జ సత్యం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు

దాదాపు 50 ఏళ్లుగా ఆర్. కృష్ణయ్య బీసీ కులగణన కోసం పోరాటం చేశారు. 75 ఏళ్లుగా బీసీల కులగణన లేకపోవటం బాధాకరం. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే బీసీల కోణం రాగానే మోసం చేస్తారు. రాహుల్ గాంధీ ఈ దేశాన్ని ఎక్స్ రే తీస్తామని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మోసం చేస్తున్నది. 33 అంశాల్లో కులం దగ్గరకు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీలు, ఇతరులు అని పెట్టారు. మాకు స్పష్టంగా బీసీలు అని ప్రత్యేక కాలం ఉండాలి. అంటే కచ్చితంగా కేంద్రం మోసం చేస్తున్నదని అర్థమవుతున్నది. 33 అంశాల్లో బీసీ కాలం పెట్టి లెక్కించాలి. అప్పుడు మాత్రమే మా స్థితిగతులు తెలుస్తాయి. మా లెక్క తెలిసినప్పుడు మాత్రమే మేము మాకు కావాల్సిన వాటా అడుగుతాం. జాగృతి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టటం చాలా అభినందనీయం. కులగణనలో మన సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే మనం జాగృతమవుతూ కేంద్రంపై ఉద్యమం చేయాలి.

కాంగ్రెస్ మోసం చేసింది -రాఘవచారి, తెలంగాణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు

కవిత చాలా మంచి ఆలోచన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కవిత ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ చెప్పి కాంగ్రెస్ కూడా మోసం చేసింది. గత ప్రభుత్వం కూడా మాకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. స్వర్ణకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి చేయటం లేదు. కవిత  బీసీలకు న్యాయం చేసేందుకు చాలా అధ్యయనం చేస్తున్నారు. వారు ఇలాగే పోరాటం చేస్తే కచ్చితంగా వారికి మా మద్దతు ఉంటుంది.

Telangana Jagruthi OBC movement

ముస్లింలకు రక్షణేది -మహ్మద్ మునవార్ అలీ, మైనార్టీ నేత

దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ఆర్సీ, సీఐఏ పేరుతో తరుచూ ముస్లింలకు ఇబ్బంది పెడుతున్నారు.  

అందుకే కులగణన పేరు చెబితే మాకు భయం వేస్తున్నది. మా ఇండ్లలోకి వచ్చి మా వివరాలు తెలుసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతారు. బీహార్ లో కూడా లక్షలాది మంది ముస్లింలను ఓటు వేయకుండా చేశారు. చాలా మంది రాజకీయ నాయకులు ముస్లింల సమస్యలపై మాట్లాడుతారు. కానీ పోరాటం చేయరు. కవిత మాత్రం ముస్లింల కోసం పోరాటం చేస్తారని నమ్మకం ఉంది. అదే విధంగా కులగణన ద్వారా అందరికీ మేలు జరగాలి.

సీఎం అయ్యే అర్హత కవితకు ఉంది -రామకృష్ణ, బీసీబీడ్య్లూఎఫ్ నేత

2010 లో సుప్రీంకోర్టు కులగణన చేయొచ్చు అని తీర్పు ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే 50 శాతం కన్నా కూడా ఎక్కువ రిజర్వేషన్లు చేసుకోవచ్చు అని కూడా కోర్టు చెప్పింది. 2022 లో మాత్రం 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఉండాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విషయంలో మేము రివ్యూ పిటిషన్ వేసే ప్రక్రియ ప్రారంభించాం. రాహుల్ గాంధీకి కులగణన ప్రాధాన్యతను నేనే వివరించాను. రేవంత్ రెడ్డి మనకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బీసీలను మోసం చేసిన వారందరూ కూడా అధఃపాతాళానికి పోయారు. కవిత ఓసీ అయినప్పటికీ బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఆమె నిజాయితీని గమనించిన తర్వాతనే మేము ఆమెకు మద్దతు ఇస్తున్నాం. 

మహిళా నేతగా ఉన్న కవిత చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ అవగాహన, అనుభవం ఉంది కనుక మీరు సీఎం అవుతారని నమ్మకం ఉంది. కులగణన విషయంలో అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకోవటం లేదు?

ఆదిశక్తిగా కవిత – అనురాధా గౌడ్, మహిళ నాయకురాలు

ఆదిశక్తిగా కవిత ఈ అంశాన్ని తీసుకురావటం సంతోషం. బీసీ రాజకీయ నాయకులు బయట మాట్లాడుతారు. కానీ సభలో మాట్లాడరు. రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లటం సరికాదు. ఏ పార్టీ అయినా సరే కవిత ఈ అంశాన్ని తీసుకోవటం సంతోషం అనిపించింది. ఆడబిడ్డ కవితకు మేము మద్దతు ఇస్తామంటూ చెబుతున్నాం. కవిత బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతాం.

ప్రశ్నావలి ప్రమాదకరంగా ఉంది -మేకల రాములు యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నేత

కులగణనలో కేంద్రం పెట్టిన అంశాలు ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని మనం అన్ని వర్గాలకు తెలిసేలా చేయాలి. బీసీలకు న్యాయం జరగాలంటే వారి సంఖ్య ఎంత ఉందో తెలియాలి. కవిత చాలా మేధావి. ఆమెకు అన్ని అంశాలపై అవగాహన ఉంది. కనుక ఆమె చేసే పోరాటానికి మేము మద్దతుగా ఉంటాం. కచ్చితంగా కవిత ఈ రాష్ట్రానికి సీఎం అవుతారని నమ్మకం ఉంది. బీసీలకు మేలు చేసే విధంగా మీరు పోరాటం చేయండి. మీ వెనుక ఉంటాం.

విజన్ ఉన్న నేత కవిత – డాక్టర్ కుమార స్వామి, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ నేత, ప్రొఫెసర్

కవిత చాలా మంచి విజన్ తో ఉన్నారు. మీరు ఎత్తుకున్న బీసీ నినాదం మిమ్మల్ని సీఎం చేస్తుంది. నర్సింగ రావు వెలమ సామాజికవర్గమైనా వెనుకబడిన వర్గాల కోసం పోరాటం చేశాం. మీరు కూడా అదే విధంగా పోరాటం చేస్తున్నారు. కచ్చితంగా మా మద్దతు మీకు ఉంటుంది. యాదవ సామాజిక వర్గం అంతా కూడా మీకు మద్దతుగా నిలుస్తాం.

బీసీ నాయకులే స్పందించడం లేదు – సోమ శైలజా గౌడ్, మహిళ నేత

గుండె ధైర్యం, కండబలం ఉన్నాసరే బీసీలు అన్యాయం అయ్యారు. ఇన్ని రోజులుగా బీసీ ఉద్యమం జరుగుతుంటే అధికారంలో ఉన్న బీసీ నాయకులు కనీసం స్పందించలేదు. ఇలాంటి అంశాన్ని తీసుకున్న కవిత అభిందనీయులు. 

కవిత అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.

బీసీ ఉద్యమం దేశమంతా విస్తరించాలి -పొద్దుటూరి ఎల్లయ్య

అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని కోరుకుంటున్న కవితను అభినందిస్తున్నా. ఎస్సీ, ఎస్టీల కన్నా కూడా బీసీలు వెనుకబడి ఉన్నారు. బీసీల కోసం ఎవరూ ముందుకు వచ్చినా సరే వారికి మద్దతుగా నిలవాలి. బీసీల కోసం కవిత  చేపట్టిన ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ అంశాన్ని యుద్ధ ప్రతిపదికన మనం బీసీల వద్దకు తీసుకెళ్లాలి. ఈ కులగణన సక్రమంగా జరగాలి. లేదంటే పార్లమెంట్ ను స్తంభింపజేస్తాం. తెలంగాణలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశం మొత్తం విస్తరించాలి. ఇతర రాష్ట్రాల్లో వారికి కూడా ఈ ఆలోచన రగిలేలా చేయాలి.

కవితకే మా మద్దతు – రాజలింగం, బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు

ఎస్సీ 57 కులాల తరఫున కవితకు మద్దతునిస్తాం. ఎస్సీల్లో కూడా 57 కులాలు ఉన్నాయి. వారిని అణగదొక్కారు. బీసీల కోసం ధర్నాలు అందరూ చేశారు. కానీ ఇప్పుడు ఎవరూ లేరు. ఒక్క కవితక్క మాత్రమే ఈ అంశం ఎత్తుకున్నారు. ఎస్సీల్లో కూడా చిన్న కులాలకు అన్యాయం జరిగింది. వారందరికీ కూడా మేలు జరిగే పరిస్థితి రావాలి. కవితమ్మ సీఎం అయితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. బీసీల్లో చాలా వెనుకబడిన వర్గాలకు కూడా మేలు జరగాలి.

పోరాటం విజయవంతం అవుతుంది -కంచి మధుసూదన్, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

కవితక్క ఎంతో మంచి అంశాన్ని తీసుకున్నారు. గతంలో చాలా పోరాటాలు ఆమె చేశారు. కచ్చితంగా ఆమె చేసే పోరాటంలో విజయవంతమవుతారని నమ్మకం ఉంది. మా అందరి సపోర్ట్ కవితకే ఉంటుంది.

ఈడబ్ల్యూఎస్ తో మాకు నష్టం – చేగూరి కుమార్, కురుమ సంఘం నాయకులు

20 నుంచి 30 లక్షలుగా ఉన్న కురుమ కులస్థులు కనీసం జెడ్పీ పదవులు కూడా పొందలేదు. జాగృతి ద్వారానైనా బీసీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకున్నా సరే మాకు న్యాయం జరగలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా నాకు ఉద్యోగం రాకుండా పోయింది. బీసీల హాస్టల్స్ ను కూడా చాలా దారుణంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే అగ్రవర్గాల ఆధిపత్యమే కనిపిస్తోంది. కనుక బీసీలకు న్యాయం జరిగేలా కవిత చేసే పోరాటానికి మేము అండగా ఉంటాం.

కాంగ్రెస్, బీజేపీల గేమ్ – శివ ముదిరాజ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేత

బీజేపీ చేస్తున్న మోసాల్లో కులగణన ఒకటి. 2027 లో కులగణనన జరగబోతోంది. బీసీల ప్రాతినిధ్యం అణిచివేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. కులగణన అంశాల్లో బీసీలు అనే అంశాన్నే పెట్టలేదు. ఫస్ట్ సర్వేలో బీసీల కాలమే లేనప్పుడు రెండో సర్వేలో ఎలా చేస్తారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ అనే కాలమ్ చేర్చకపోవటంతో అన్యాయం జరిగింది. అట్లాంటి కుట్రనే ఇవ్వాళ బీజేపీ చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కు కూడా తెలుసు. ఈ రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నాయి. గతంలో బ్రిటీష్ వాళ్లే ఆరు సర్వేలు చేశారు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక్క కాలమ్ పెట్టటం సాధ్యం కాదా? ఇది పనికిరాని సర్వే మాత్రమే అవుతుంది. బీసీలను వందేళ్లు వెనక్కి నెట్టే పరిస్థితి ఉంటుంది. బీజేపీ వాళ్లు చెప్పే సనాతన ధర్మంలో బీసీలకు చోటు లేదు. బీసీలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా బీసీ కాలమ్ అనేది పెట్టాలి.

విశ్వకర్మలకు అన్యాయం -సావిత్రి, అఖిల భారత విశ్వకర్మ మహాసభ గౌరవాధ్యక్షులు

బీసీల్లో అన్ని కులాలకు న్యాయం జరగాలి. విశ్వకర్మలకు చాలా అన్యాయం జరుగుతోంది. కవిత తీసుకున్న ఈ అంశం చాలా మంచిది. కచ్చితంగా వారికి మా తరఫున అండగా ఉంటాం. మహిళలకు కూడా న్యాయం జరిగే విధంగా కవిత  కృషి చేయాలి.

బీసీలకు న్యాయం చేస్తే మా మద్దతు ఆమెకే – మణికొండ వెంకటేశ్వర్ రావు, మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు

కవిత చేపట్టిన అంశం చాలా మంచిది. వారి ఆధ్వర్యంలో మనమంతా కూడా బీసీలకు న్యాయం జరిగేందుకు పోరాటం చేయాల్సి ఉంది. కవిత చేస్తున్న పోరాటానికి మేము అండగా ఉంటాం. అదే విధంగా బీసీలకు న్యాయం చేస్తే ఆమె పెట్టబోయే పార్టీకి కూడా మద్దతుగా నిలుస్తాం.

తెలంగాణకు మార్గదర్శి కవిత – డాక్టర్ జహంగీర్, మైనార్టీ నేత 

కవిత బీసీ సమాజానికి మేలు చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఆమె అన్ని వర్గాల వాయిస్ ను వింటున్నారు. కులగణన విషయంలో కవిత చేస్తున్న పోరాటాన్ని ఇతర రాష్ట్రాలు కూడా గమనించాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. కవిత తెలంగాణకు కొత్త దారి చూపుతారన్న నమ్మకం ఉంది.

క్రమీలేయర్ ఉండాలి – శేఖర్ రెడ్డి, తెలంగాణ ఈబీసీ అధ్యక్షులు

తెలంగాణ రుద్రమ దేవి మన కవితక్క. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం కవితది. అన్ని వర్గాల్లో కూడా క్రిమిలేయర్ విధానం ఉండాలి. అప్పుడు మాత్రమే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.

గర్జించే సింహంలా కవిత – జక్కని సంజయ్ కుమార్, బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపకులు

వెనుకబడిన వర్గాల తరఫున గర్జించే సింహంలా కవిత పోరాడుతున్నారు. బీసీలకు స్వాంతంత్రం వచ్చిన నాటి జరుగుతున్న మోసాన్ని ఆపే సమావేశం ఇది. బ్రిటీష్ వారి తర్వాత బీసీల కోరుకుంటున్న గుర్తింపు ఇచ్చే సమావేశం. 

ఈనాటికి బీసీలు తమ హక్కులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. బీసీల జనాభా 56 శాతం ఉందంటే…సైంటిఫిక్ డేటా ఏదీ అని సుప్రీంకోర్టు అడుగుతోంది. జంతువులకు, పక్షులకు ఉన్న లెక్క…బీసీలకు ఎందుకు లేదు. కేంద్రం జనగణన విషయంలో ఇచ్చిన మాట మీద నిలబడాలి. కానీ మోసంతో కుట్రతో కులగణనను ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు. కులగణన జరగకపోవటంతో మనం 56 శాతం ఉంటే 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు వస్తున్నాయి. ఈ పోరాటం ముందుకు పోయేందుకు తప్పకుండా కవితకు మద్దతునిస్తాం.

కులగణనతోనే న్యాయం – ప్రశాంత్, అఖిల భారత ఆరె కటిక సంఘం సౌత్ ఇండియా కన్వీనర్

కులగణన జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో ముందుకు రావాలి. 

కవితక్క చేపట్టిన ఈ పోరాటానికి మా మద్దతు ఉంటుంది.

గణన సరిగ్గా జరగకుండా కుట్ర – మేకపోతుల నరేందర్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

బీసీలకు అన్యాయం జరగబోతోందని కవిత ముందే గ్రహించారు. ఈ అన్యాయం జరగకుండా సమాజం ముందు ఈ అంశాన్ని పెట్టారు. దీంతో అన్యాయం జరగుతున్న బీసీలే ఇప్పుడు పోరాటం చేస్తారు. భారతీయ సమాజంలో బీసీలు, మహిళలు బాధితులు. బ్రిటిష్ సమయంలో చేసిన కులగణన ఆధారంగానే రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రం చేస్తామంటున్న కులగణన డాక్యుమెంట్లో బీసీ, ఓబీసీ కాలమే లేదు. కాంగ్రెస్ చేపట్టిన కులగణనకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నాయకులు మాట్లాడారు. అంటే అది బీసీలకు వ్యతిరేకంగా చేసిన కుట్ర. సరైన డేటాను కచ్చితంగా లెక్క తీసి కోర్టు ముందు పెడితే కచ్చితంగా అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కులగణన సరిగా జరగకుండా కుట్ర చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన కవితకు మనం అండగా ఉండాలి.

అగ్రకులాలకు అన్యాయం – పోలాడి రామారావు, ఓసీ జాతీయాధ్యక్షులు

అగ్రకులాల జనాభాలో ఈ రాష్ట్రంలో 21.5 శాతం ఉంది. అందులో పఠాన్లు, సయ్యద్ లు కూడా ఉన్నారు. మేము ఎవరికీ అన్యాయం చేయాలని కోరలేదు. బీసీలకు చాలా అన్యాయం జరిగింది. వారిని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. రాజకీయ రిజర్వేషన్లు ఓసీలకు లేవు. మొన్న ఓసీలు 13 శాతం మాత్రమే గెలిచారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ దారుణంగా వంచించింది. ఓసీ జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. 

దీంతో అగ్రకులాలకు కూడా చాలా అన్యాయం జరిగింది. ఐతే అన్ని కులాలకు ముఖ్యంగా బీసీలకు కూడా న్యాయం జరగాలి.