కులగణన సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశం

భారత జనగణన చేపట్టిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధినేత్రి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జనగణన చేయడానికి రూపొందించిన  డాక్యుమెంటులో ఎస్సీ, ఎస్టీల కాలం పెట్టారు కానీ ఓబీసీ లేకుండా కులం అనే కాలం మాత్రమే పెట్టారని విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని ఖాజా మాన్షన్ లో జాతీయ జనగణనలో కులగణన-సమగ్ర చర్చ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన కవిత మాట్లాడుతూ..కులాల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కులాలను పిలుస్తారన్నారు. నన్నే తీసుకుంటే నేను వెలమను.. తెలంగాణలో ఓసీ, మహారాష్ట్రలో ఎస్సీ, ఏపీ లో బీసీగా గుర్తిస్తారని చెప్పారు. చిన్న సంఖ్యలో ఉన్న కులానికే ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయని, మరి 56 శాతం ఉన్న బీసీల విషయంలో ఎంత గందరగోళం ఉంటుందో ఆలోచించాలన్నారు. గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారని, వాళ్లు ఏ కేటగిరీలో వస్తారో చెప్పలేదన్నారు. ఇవ్వాళ మన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కమ్యునిటీల వాళ్లు వచ్చారని, 

మనం ఇచ్చే అభిప్రాయం రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి సూచికలా ఉండాలని కవిత కోరారు. బీజేపీ కులగణన విషయంలో ఇచ్చిన మాట తప్పినట్లు స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోందని తెలిపారు. తెలంగాణ నుంచి మన అభిప్రాయం కూడా ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా జనగణన, కులగణన పై ఎక్సర్ సైజ్ జరుగుతోందని కవిత తెలిపారు. 

Kavitha speaking at caste census round table meeting

కోవిడ్ తో ఆలస్యం

నిజానికి పదేళ్లకు ఒకసారి జనగణన చేయాలని, 2021 లో జనగణన చేయాల్సి ఉండేనని, కానీ కోవిడ్ కారణంగా జనగణన చేయలేదని కవిత చెప్పారు. ఐతే కులగణనపై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావటంతో కేంద్రం అందుకు అంగీకరించిందని వివరించారు. నిజానికి కులగణన చేయాలన్న బుద్ది బీజేపీకి రావటం మమ్మల్ని ఆశ్చర్యపరించిందని కవిత తెలిపారు. జనగణన చేసినప్పుడే ఏ వర్గం ఎంత ఉంది? వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుందన్నారు. కులగణనకు కేంద్రం ముందుకు రావటంతో సంతోషించామని, కానీ ఎప్పుడైతే డాక్యుమెంట్ విడుదల చేశారో అప్పుడే వాళ్ల బుద్ది బయట పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న కులాలు, వాటి ఉపకులాల నివేదికను జాగృతి సిద్ధం చేస్తున్నదని పేర్కొన్నారు. నిజానికి ఈ పని ప్రభుత్వమే చేయాలని కవిత చెప్పారు. కానీ వాళ్లకు చిత్తశుద్ది లేదన్నారు. అందుకే మేము అందరి ఒపీనియన్స్ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ థింక్స్ ఫస్ట్.. ఇండియా ఫాలోస్ నెక్స్ట్ అనే విధంగా మనం ఉంటామని కవితచెప్పారు. కులగణన విషయంలోనూ మనం అదే విధంగా నివేదికను కేంద్రానికి ఇద్దామని కవిత తెలిపారు. ప్రతి కులానికి అన్ని హక్కులు సాధించుకునేలా ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. ఇలాంటి అంశంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని తెలిపారు. కచ్చితంగా ఈ అంశంపై ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉండాలని సూచించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. కానీ అన్ని పార్టీలు కూడా తమ స్టాండ్ ఏంటో చెప్పాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు.

Telangana Jagruthi caste census discussion Hyderabad