తెలంగాణ జాగృతి కల్చరల్ కమిటీ సభ్యులు పడాల మనోజ గౌడ్, సుజిత్ రావు తెలంగాణ జానపద సకల కళల పరిరక్షణ జేఏసీ అధ్యక్షులు మురళీధర్ దేశ్ పాండేను కలిసి కళాకారుల సమస్యలపై అధ్యయనం చేశారు.
కళాకారుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్న దేశ్ పాండే లాంటి వారి సలహాలు, సూచనలు ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ భావిస్తున్నది. ఇప్పటికే జాగృతి జనంబాటలో భాగంగా వివిధ జిల్లాల పర్యటనలో కళకారులతో జాగృతి ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహించింది. కాళాకారులకు గుర్తింపు కార్డులు, పింఛన్ల కోసం కవితక్క కట్టుబడి ఉందన్న విషయం దేశ్ పాండే తో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన కళాకారులు మున్ముందు కూడా సామాజిక తెలంగాణ సాధనలో కృషి చేసేలా ప్రోత్సహించాలని అభిప్రాయం వ్యక్తమైంది.









