రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోంది
టీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది
-సూరారపు కృష్ణవేణి
(సూర్యాపేట):
రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోందని, ప్రభుత్వం రైతులపై కక్ష కట్టినట్టు ఉందని టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు 20 రోజులకు పైగా పడిగాపులు కాసే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. బుధవారం ఆమె జిల్లాలోని ఆత్మకూరు ఎస్, చివ్వేంల మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అలసత్వ వైఖరి, అక్రమ పద్ధతులపై మండిపడ్డారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించే పంట అమ్ము కోవడానికి కూడా ఐకేపీ కేంద్రాల్లో సరైన వసతులు లేవని, ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు జరపకుండా రైతులను తిప్పు కంటున్నారని కనీస మద్దతు ధర లేదు, రైతు గోడు పట్టించు కాకుండా రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండ కడతామని అన్నారు, రైతులకు అండగా టీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే కొనుగోళ్లు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు ఉప్పలాచారి, లింగయ్య, నాగేందర్, గీత, శ్యామ్ నాయక్ పాల్గొన్నారు.








