

జాగృతి జనంబాటలో భాగంగా జిల్లాలో పర్యటించిన కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని లింగం హోటల్ లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చటించారు. పట్టణ విశేషాలు, ఉపాధి, వ్యాపార వ్యవహారాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రధానంగా స్థానికుల సమస్యలు, అవసరాలపై ఆరా తీశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్వయంగా తమతో పాటు చాయ్ తాగుతూ సరదాగా మాట్లాడ్డంతో స్థానికులు ఆనంద పడ్డారు. అనంతరం అక్కడే ఉన్న పాన్ షాపులో తనకిష్టమైన మీనాక్షి స్వీట్ పాన్ కట్టించుకుని తిన్నారు.
దర్గా సందర్శన
అంతకు ముందు న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆలేరు పర్యటనలో భాగంగా ఆలేరు దర్గాను సందర్శించారు. దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.










