తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ ఏపీతో రేవంత్ రెడ్డి మిలాఖత్
రేవంత్ చేస్తున్న ద్రోహన్ని తెలంగాణ సమాజం క్షమించదు
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను సీఎం రేవంత్ రెడ్డి కాలరాస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెరచాటుగా ఏపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ లో లోపాలున్నాయని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ సమాజం క్షమించదని ఆమె అన్నారు.
రాష్ట్రానికి సున్నం పెట్టి.. చంద్రబాబుకు గురుదక్షణ
గోదావరి లో తెలంగాణ నీటి హక్కులను ఫణంగా పెట్టి ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి తెరచాటుగా సహకరిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మన నీటి హక్కులకు నష్టం చేసే పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ లో లోపాలు ఉన్నాయని చెప్తూ ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీసులు ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సున్నం పెట్టి.. ఏపీ సీఎం చంద్రబాబుకు గురు దక్షిణగా గోదావరి నీళ్లను రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బనకచర్ల విషయంలో ఏపీకి రేవంత్ ఎంతగా సహకరిస్తున్నాడో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.
రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదు
తెలంగాణ కు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ ప్రాంత హక్కులను కాపాడాల్సింది పోయి ద్రోహం చేయటం సరికాదన్నారు. ఆయన చేస్తున్న పనికి తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు. ఈ ముఖ్యమంత్రికి నీళ్ల సోయి లేకపోవడం తెలంగాణకు శాపంగా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీతో ముఖ్యమంత్రితో మిలాఖత్ రాజకీయాలు మాని తెలంగాణకు హక్కుల కోసం రేవంత్ రెడ్డి పనిచేయాలని కవిత సూచించారు. ఏపీ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై పటిష్టమైన పిటిషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టును అడ్డుకోకపోతే తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసిన వారవుతారని హెచ్చరించారు.








