జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి నేతృత్వంలో పోస్టర్ ఆవిష్కరణ | (సూర్యాపేట)

Jagruti Janambata poster launch in Suryapet district

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట కవిత నేతృత్వంలో జనవరి 3,4 తేదీల్లో సూర్యపేట జిల్లాలో జరగనున్న “జాగృతి జనంబాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి పిలునిచ్చారు. మంగళ వారం జిల్లా కేంద్రంలో జాగృతి ముఖ్య నాయకులతో కలిసి ఆమె “జనంబాట” పోస్టర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 3,4 తేదీలలో జిల్లాలో చేపట్టనున్న జనంబాటలో కల్వకుంట్ల కవిత పాల్గొంటారని చెప్పారు.3న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రం మొత్తం  పర్యటిస్తూ వస్తున్న కవితక్క సూర్యపేట జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యపై దృష్టి పెట్టి పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని వెల్లడించారు.4న కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కానున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అపరిష్కృతంగా  ఉన్న సమస్యల పరిష్కారం కోసం, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, విద్యా, వైద్యం వంటి ప్రధాన అంశాలను తీసుకొని పర్యటన కొనసాగిస్తారని తెలిపారు. భవిష్యత్తులో ”సామాజిక తెలంగాణ” సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సందర్భంలో జనంబాటలో కవితకు విశేష స్పందన లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జనంబాటలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యావంతులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, కందుల  మధు, జితేందర్, సాయి గౌడ్, ఉమారాణి, సైదిరెడ్డి, నకిరెకంటి సతీష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.