తెలంగాణ రక్షణ సేనలో చేరికలు

బోథ్, ఖైరతాబాద్, అంబర్ పేట్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున చేరిన నాయకులు

కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత

(హైదరాబాద్)

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు
సీనియర్ నాయకుడు మతిన్ అధ్వర్యంలో అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మహిళలు టీఆర్ఎస్ లో చేరారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి నర్సింహ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్ లో చేరారు.