నాగేశ్వర్ జోలికొస్తే సహించం
-కల్వకుంట్ల కవిత

(హైదరాబాద్)
ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. జర్నలిజం ప్రొఫెసర్ గా, రాజకీయ విశ్లేషకులుగా ఆయనకు దశాబ్దాల అనుభవం ఉన్నదని.. ఆయన చేసే విశ్లేషణల ఆధారంగా అనేక రాజకీయ పార్టీలు తమ స్టాండ్ మార్చుకున్న సందర్భాలెన్నో ఉన్నాయని గుర్తు చేశారు. జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని, వారికి తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని తెలిసిందని కవిత తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ మేధావులపై దాడేనని తెలిపారు.