చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, శ్రీకాంతాచారిల ఋణం తీర్చుకోవడానికే బీసీ ఉద్యమం

జాతీయ స్థాయిలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమిస్తా

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తాం

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ :

చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, శ్రీకాంతాచారిల ఋణం తీర్చుకోవడానికే బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమం ప్రారంభించానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ, తాము చేసిన ఉద్యమాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ, కౌన్సిల్ లో తీర్మానం చేసి పంపిందన్నారు. బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి దాని ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలేవి చేయడం లేదన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరపున 50 శాతం టికెట్లు బీసీ నాయకులకు ఇస్తానని హామీ ఇచ్చారు.