సక్సెస్ కు షార్ట్ కట్ లేదు. హార్డ్ వర్కే సక్సెస్ కు మార్గం
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో అబద్దం చెప్పవద్దు
ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి
-కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, మెహదీపట్నం)
సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదని, కచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే.. హార్డ్ వర్క్ మాత్రమే మనల్ని కాపాడుతుందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్ లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న టీఆర్ఎస్ అధ్యక్షులు కవిత మాట్లాడుతూ దాదాపు 150 కంపెనీలతో 2 వేల ఉద్యోగాలిచ్చే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. జెన్యూన్ గా అర్హత ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలను కోరారు. ఇక్కడకు వచ్చిన వారిలో ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లమా చేసిన వాళ్లతో పాటు టెన్త్ పాస్ అయిన వాళ్లు కూడా ఉన్నారని, వాళ్లందరికీ వాళ్ల అర్హతలకు తగిన విధంగా జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇంటర్వ్యూలో అబద్దాలు చెబితే జాబ్ వస్తుందని అనుకోవద్దని అభ్యర్థులకు కవిత సూచించారు. ఇంటర్వూలో తెలిసిందే చెప్పండని, నిజం చెప్పాలని సూచించారు. అవసరమైతే టైమ్ ఇస్తే నేర్చుకుంటాను అని నిజాయితీగా చెప్పాలన్నారు. యూఎస్ లో తన ఫస్ట్ జాబ్ విషయంలో తాను అదే చేశానన్నారు. 2001 లో యూఎస్ లో జాబ్ క్రైసెస్ ఉన్న సమయంలో తాను ఇంటర్వ్యూకు వెళ్లానని తెలిపారు. వాళ్లు అడిగిన వాటికి తనకు సమాధానం తెలియకపోతే తెలియదు అని చెప్పానన్నారు. కానీ 20 రోజులు సమయం ఇస్తే నేర్చుకుంటానని చెప్పినట్లు వివరించారు. వాళ్లు టైమ్ ఇస్తే నేర్చుకొని జాబ్ సంపాదించానని వివరించారు. ఇప్పుడు ఏం నేర్చుకోవాలన్నా ఫ్రీ గా యూట్యూబ్ లో నేర్చుకునే వెసలుబాటు ఉందన్నారు. ఫార్మాల్ కాలేజ్ లలో ఇప్పుడు 70 శాతం అమ్మాయిలే చేరుతున్నారని, వారికోసం 70 శాతం జాబ్ మార్కెట్ ఉన్నట్లేనని కవిత వెల్లడించారు. కచ్చితంగా జాబ్ వస్తుందన్న విశ్వాసంతో ఉండాలని ధైర్యం చెప్పారు. ఒకవేళ జాబ్ రాకపోయినా సరే మళ్లీ ప్రయత్నం చేయాలని చెప్పారు.








