నిర్దాక్షిణ్యంగా కవిత అరెస్ట్

బండరాళ్లపై పడేసి.. కారు డోరుకేసి గుద్దుతూ.. గుంజుకపోయిన పోలీసులు

టీఆర్ఎస్ తలపెట్టిన భూపోరాటంలో పోలీసుల ఓవరాక్షన్

వేలమంది ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టిన ఖాకీలు

హెచ్ఎండీఏ భూముల్లో ఉద్యమకారుల రక్షణ కాలనీ బోర్డు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ చీఫ్

బొడ్రాయి పెట్టి.. బోనం ఎత్తి పూజలు చేసిన కల్వకుంట్ల కవిత, ఉద్యమకారులు

కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి నుంచి కౌంట్ డౌన్ షురువైందన్న కవిత

అడుగడుగునా అడ్డుకున్నా టీఆర్ఎస్ భూపోరాటం గ్రాండ్ సక్సెస్

బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట టీఆర్ఎస్ శ్రేణుల మెరుపు ధర్నా

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

తెలంగాణ రక్షణ సేన పార్టీ గురువారం బోడుప్పల్ లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఓవరాక్షన్ చేశారు. బండ రాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్దుతూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. కవిత ను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్భందించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకొని కవిత ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వేలమంది బోడుప్పల్  చేరుకున్నారు. భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్ఠించి, బోనం ఎత్తి ప్రత్యేక పూజాలు చేశారు. 

బండరాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్ది..

కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా చేతులపై అమాంతం ఎత్తుకెళ్తున్నప్పుడు జరిగిన తోపులాటలో కవితను కింద పడేశారు. అక్కడున్న పెద్ద పెద్ద బండ రాళ్లపై కవితను కుదేసినట్టుగా కింద పడేశారు. తోపులాట తాకిడికి పోలీసులు కూడా ఆమె మీద పడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి పోలీసు కారు వరకు చేతులపై ఎత్తుకెళ్లిన పోలీసులు తోపులాటలో ఆమెకు రక్షణగా లేకపోవడంతో కారు డోర్ కు ఢీ కొట్టారు. దీంతో కవిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా వారిని తోసేస్తూ కవితను కారు ఎక్కించారు. టీఆర్ఎస్ నాయకులపై, ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. జర్నలిస్టులను కూడా వదలకుండా వారిపై చేయి చేసుకున్నారు. వందల మంది ఉద్యమకారులను, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. 

Kavitha arrested during Boduppal land protest over HMDA lands and activists' demands.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ షురూ..

కవిత ను అరెస్ట్ చేసి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొన్ని గంటల పాటు ఆమెను స్టేషన్ లో నిర్భందించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాళ్టి నుంచి కౌంట్ డౌన్ షురువైందన్నారు. ఉద్యమకారులకు మీరిచ్చి హామీలను అమలు చేయాలని అడిగితే లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొడతారా.. అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత ను విడుదల చేయాలని బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు. ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తే ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో కవితను నిర్బంధించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం

బోడుప్పల్ లోని హెచ్ఎండీఏ కు చెందిన భూమికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్ఠించి పూజాలు నిర్వహించారు. ఇక నుంచి ఈ ప్రాంతంలోని భూములు ఉద్యమకారులవే అని స్పష్టం చేశారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా సరే వాళ్ల కళ్లుగప్పి కవిత భూ పోరాటం ప్రాంతానికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచే ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. బంజారాహిల్స్ లో కవిత ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే పోలీసులను తప్పించుకొని కవిత భూ పోరాటం ప్రాంతానికి చేరుకున్నారు. వేల మంది ఉద్యమకారులు, పార్టీ నాయకులతో కలిసి భూ పోరాటం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్ల కార్డులు ప్రదర్శించారు. ఉద్యమకారులకు వెంటనే 250 గజాల స్థలాన్నిఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అడ్డుకున్నా.. వెనక్కి తగ్గని ఉద్యమకారులు

తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడునా ప్రయత్నించారు. నిన్న రాత్రి నుంచే అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణులను, ఉద్యమకారులకు అదుపులోకి తీసుకున్నారు. బోడుప్పల్ కు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయినా సరే ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఉదయం 9 గంటల వరకే వేలాది గా ఉద్యమకారులు బోడుప్పల్  కు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. భూపోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లను తొలగించారు. ఉద్యమకారుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. వారిని దుర్భాషలాడుతూ లాఠీలతో కొట్టారు. వందల మందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత, తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఎన్ని నిర్బంధాలు పెట్టిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామని కవిత స్పష్టం చేశారు.