పాలిటెక్నిక్ విద్యపై తెలంగాణ రక్షణ సేన అధ్యయన కమిటీ
జీవో 97 తర్వాత పర్యవసానాలు.. స్కిల్ యూనివర్సిటీలో విలీనంతో తలెత్తే దుష్పరిణామాలపై స్టడీ చేయనున్న కమిటీ
వారం రోజుల్లోగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్య కొనసాగింపు, ఆవశ్యకతపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పలువురు విద్యావేత్తలు, పార్టీ నాయకులతో కమిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 తీసుకువచ్చి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను చేర్చడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవో 97ను రద్దు చేయాలని, శక్తి (కార్మిక శాఖ) పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను చేర్చవద్దని డిమాండ్ చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ నుంచి ప్రమోటర్లు తప్పుకుంటే తమ భవిష్యత్ ఏమవుతుందని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగించడం, జీవో 97తో తలెత్తే దుష్పరిణామాలు, శక్తి (కార్మిక శాఖ) పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను చేర్చితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయనే అంశాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కవిత ప్రకటించారు. పలువురు విద్యవేత్తలు, విద్యారంగంలో పని చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులను కమిటీలో సభ్యులుగా నియమించామని తెలిపారు. కమిటీ సభ్యులు పాలిటెక్నిక్ విద్యపై సమగ్ర అధ్యయనం చేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు.
కమిటీ సభ్యుల వివరాలు :
1) దూగుంట్ల నరేశ్ ప్రజాపతి
2) మోరం వీరభద్రారావు
3) సురభి
4) కొంగర ధరణి రాణి
5) కోట్ల మహేందర్ రెడ్డి (కనిష్క)
6) ఊదరి చంద్రమోహన్ గౌడ్
7) నడిపల్లి వెంకటేశ్వర్ రావు








