మహాత్ముడి స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తాం
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
బాపూజీ స్మరణలో రక్తదాన శిబిరం
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
మహాత్ముడి స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామని తెలంగాణ రక్షణసేన నాయకులు అన్నారు. శుక్రవారం గాంధీ 157వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన ఫొటోకు పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నవీన్ ఆచారి, మాసన్నగారి బాలయ్య, కోల శ్రీనివాస్, వేముల భవాని, శివారెడ్డి, మనోజా గౌడ్, హలీమా తదితరులు పాల్గొన్నారు. బాపూజీ స్మరణలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కూకట్ పల్లి ఓమిని హాస్పిటల్స్ బ్లడ్ సెంటర్ నిర్వహకులు రక్తం సేకరించారు. 45 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.









