Telangana Jagruthi

Kalvakuntla Kavitha Hits Back at KTR, Says “Don’t Mess With Me”
నాతో పెట్టుకోవద్దు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం

నేను నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతున్న

బీఆర్ఎస్ అధినేత నిర్ణయాన్నే వ్యతిరేకించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా?

అహంకారం.. అక్రమ దందాలతో పార్టీని పాతాళంలోకి నెట్టిందే కేటీఆర్

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

తాను ఏ విషయమైనా నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతానని.. తనతో పెట్టుకోవద్దని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తాను విష నాగుల చెరలో లేనని.. వారు చెప్పే మాటలు విని ఏది పడితే అది మాట్లాడబోనని స్పష్టం చేశారు. అహంకారం.. అక్రమ దందాలతో బీఆర్ఎస్ ను పాతాళంలోకి నెట్టిందే మీరు అంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ‘‘ఎక్స్’’ వేదికగా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాను బీఆర్ఎస్ లో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తే కొన్ని గంటల్లోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. అదే గుంటనక్కతో అంటకాగుతూ పార్టీ అధినేత తీరును బహిరంగంగా ప్రశ్నించడం పార్టీకి వ్యతిరేకం కాదా అని నిలదీశారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ఫాం హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు, ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలతో పార్టీని పాతాళంలోకి నెట్టిన వాళ్లే ఇప్పుడు ఆ పార్టీ అధినేతను తప్పుపట్టడంపై కవిత మండిపడ్డారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు పార్టీలో ఆయన వైఫల్యాన్ని, ఆయన  చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నారంటే ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. గణేశ్ నిమజ్జనోత్సంలో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లను బతిమాలుకొని పాటలు ప్లే చేయించుకున్న విషయం గణేశ్ మహరాజ్ కు.. కేటీఆర్ అంతరాత్మకు తెలుసన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే ‘‘నీ పెండ్లామా!? అంత అర్జెంటా!?’’ అని అహంకారంతో అతని భార్యను అవమానించారని..’’ గతంలో సాయం కోసం వెళ్లిన మహిళను ‘‘నా కోసం కన్నావా’’  అని ఆమె మాతృత్వాన్ని అవమానించారని గుర్తు చేశారు. గుంటనక్క మైండ్ గేమ్ ను బ్లైండ్ గా నమ్ముతూ పెద్ద మనిషిని తప్పు పడుతూ బీఆర్ఎస్ పార్టీకి గోతిని తవ్వుతున్నావని హెచ్చరించారు.

The post Kalvakuntla Kavitha Hits Back at KTR, Says “Don’t Mess With Me” appeared first on Telangana Jagruthi.

Kongara Khurd Land Dispute: Kalvakuntla Kavitha Raises Questions Over Waqf Lands
కొంగరకుర్దు- ఏ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ భూ మాఫియా

ఆ భూములు రైతులకే దక్కాలి

అధికార, ప్రతిపక్ష ముఖ్య నాయకులు వక్ఫ్ భూములు కొట్టేస్తున్నారు

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

భూ బాధితులతో కలిసి మీడియా సమావేశం

నమస్తే తెలంగాణ, సాక్షిలో ఒక్క రోజు వార్తలు రాసి బీఆర్ఎస్ ముఖ్య నేత ఒత్తిడితో కబ్జా బాగోతాన్ని పక్కన పెట్టారని ఆరోపణ

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్గనైజ్డ్ గా భూ మాఫియా పెద్ద ఎత్తున భూములు కబ్జా పెడుతున్నదని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు(ఏ) లో అధికార, ప్రతిపక్ష ముఖ్య నాయకులు వక్ఫ్ భూములు కొట్టేస్తున్నారని ఆ భూములు రైతులకే తగ్గాలని డిమాండ్ చేశారు. కొంగరకుర్దు(ఏ) భూ బాధితులతో బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కవిత సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంగరకుర్దు(ఏ)లో ఉన్న 580 ఎకరాల వక్ఫ్ భూమిలో ఇప్పటికే 150 ఎకరాలు భూ మాఫియా చెరలోకి వెళ్లిపోయిందని విమర్శించారు.  కొంగరకుర్దులోని సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న 580 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందని 2007లోనే గెజిట్ ఇచ్చి 22ఏ లో చేర్చారని వివరించారు. 2022లో ఈ భూములపై మాఫియా కన్ను పడిందన్నారు. ఒక రైతు 58 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే మూడు జేసీబీలతో ఆ పంటను ధ్వంసం చేసి లే ఔట్ చేశారని తెలిపారు. బిహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎంతటి దౌర్జన్య పరమైన రాజ్యం సాగుతుందో కొంగరకుర్దులో అంతే దౌర్జన్యంగా రైతులు సాగుచేసుకుంటున్న భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ మాఫియా ఆగడాలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదని విమర్శించారు. కొంగరకుర్దు గ్రామంతో సంబంధం లేని వారి పేర్లతో ఓ ఆర్ సీ లు సృష్టించి వాటితో కోర్టుల్లో కేసులు వేసి అనుకూలంగా తీర్పులు తెచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ఆరోపించారు. 2022 లో 22ఏ లో ఉన్న కొంగరకుర్దు భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయన్నారు. దానికి సంబంధించిన అన్ని రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని కవిత చెప్పారు.

కోర్టులో తేలుతుంది

అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ అనే సంస్థలు కొంగరకుర్దు(ఏ)లో భారీ వెంచర్లు వేశాయని కవిత తెలిపారు. 2022 తర్వాత ఇక్కడ జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో లే ఔట్ పర్మిషన్ ఎలా ఇచ్చారని, హెచ్ఎండీఏ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రోజు కూడా కొంగరకుర్దు భూముల్లో నిషేధిత జాబితాలో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు, వక్ఫ్ బోర్డుకు మధ్య కోర్టులో న్యాయ వివాదం కొనసాగుతుంది.. కోర్టు తీర్పు వస్తే అది వక్ఫ్ బోర్డుదా, రైతులదా అనేది తేలుతుందన్నారు. అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ ఇకపై ఒక్క గజం భూమిలో వెంచర్ ఎక్స్ టెండ్ చేసినా రంగారెడ్డి కలెక్టర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. కొంగరకుర్దు రైతులను రెండు నిర్మాణ సంస్థలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని కవిత చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి రూ.5 వేల కోట్ల విలువైన 580 ఎకరాల భూమిని కొట్టేస్తున్నారని తెలిపారు. బందిపోటు దొంగలు కూడా ఇలా పగటి పూట దొంగతనం చేయరని విమర్శించారు. నమస్తే తెలంగాణలో ఒక్కరోజు ఈ భూ మాఫియాపై వార్త వచ్చిందని.. అది ఒక ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడి వెంచర్ ..దాని వెనుక మరో ముఖ్య నాయకుడు ఉన్నాడని తెల్లారి నుంచి ఆ పేపర్ల ఒక్క ముక్క కూడా రాయలేదని విమర్శించారు. సాక్షి పేపర్లో భూ మాఫియాకు వ్యతిరేకంగా ముందురోజు ఆర్టికల్ వచ్చిందని.. ఆ తెల్లారే రైతులకు వ్యతిరేకంగా స్టోరీ రాసిన్రని గుర్తు చేశారు. రామన్న -జగనన్న దోస్తులు అయ్యిండ్రని ఈ మధ్యే తెలిసిందని.. అందుకే ముందరోజు భూ మాఫియా కు వ్యతిరేకంగా వార్త వస్తే.. తెల్లారే దాన్ని రైతులకు వ్యతిరేకంగా మార్చిన్రని అర్థమైందన్నారు. దీని వెనుక ఏ శక్తులు ఉన్నయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ అక్రమాలకు నిదర్శనం

కొంగరకుర్దు భూముల విషయంలో తన సంతకాలు ఫోర్జరీ చేశారని.. ఆ డాక్యుమెంట్లు యాక్సెప్ట్ చేయొద్దని బాలమయా దేవి అనే ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వానికి లేఖ రాసిందని కవిత చెప్పారు. నర్సమ్మ అనే రైతు భూమికి లక్ష్మీ అనే పేరుతో ఓ ఆర్ సీ తెచ్చుకున్నారని,  ఇలాంటి అక్రమాలు ఎన్నో కొంగరకుర్దులో జరిగాయని ఆరోపించారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొన్ని ఇండ్లే బంగారం అయ్యాయని తాను ముందు నుంచీ చెప్తున్నానని దానికి ఈ కొంగరకుర్దు భూముల అక్రమాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

The post Kongara Khurd Land Dispute: Kalvakuntla Kavitha Raises Questions Over Waqf Lands appeared first on Telangana Jagruthi.

Telangana MBBS Local Quota: Kavitha Raises Objections to GO 33, GO 150
తెలంగాణ మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ తీరుతో నష్టం

ప్రభుత్వం తెచ్చిన జీవో కారణంగా తెలంగాణ బిడ్డలు రక్షణలు కోల్పోయే ప్రమాదం ఉంది

ఈ విపత్తుకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజమంతా పోరాటం చేయాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

మెడికల్ సీట్లలో స్థానికత మార్చే విధంగా ప్రభుత్వం తెచ్చిన జీవో లు 33, 150 ల కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోలతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని..ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆవేదన వ్యక్తం  చేశారు. తెలంగాణకు నష్టం చేసే ఇలాంటి జీవోలను రద్దు చేయాల్సింది పోయి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ దాన్ని డిఫెండ్ చేయటమేమిటనీ ప్రశ్నిస్తూ సోమవారం వీడియో సందేశం విడుదల చేశారు. వెంటనే ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఇక్కడి ప్రజలకు అన్ని రంగాల్లో సర్వ హక్కుల కోసమని..కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ హక్కులనే హరించేలా జీవోలు తెస్తోందని మండిపడ్డారు. 1 నుంచి 7 వ తరగతి వరకు చదివిన వాళ్లను స్థానికులుగా భావించాల్సింది పోయి 8 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఇక్కడ చదివిన వాళ్లకు స్థానికులుగా అవకాశం ఇవ్వటమేమిటనీ ఆమె నిలదీశారు. దీని కారణంగా తమ పిల్లలు నష్టపోతున్నారని ఇప్పటికే విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ సీట్లలో తీసుకొచ్చిన ఈ స్థానికత విధానాన్ని రేపు అన్ని రంగాల్లో అమలు చేస్తారని..అదే జరిగితే తెలంగాణ యువత పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందన్నారు.

విపత్తుకు వ్యతిరేకంగా గళమెత్తాలి

ప్రభుత్వం తెచ్చిన జీవోలు తెలంగాణకు విపత్తు లాంటివని కవిత హెచ్చరించారు. దీనిపై కచ్చితంగా తెలంగాణ సమాజమంతా ప్రశ్నించాల్సిన అవసరముందని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఛైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండ రాం ఈ అంశంపై గళమెత్తాలని.. విద్యార్థులకు జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించాలని కోరారు. అదే విధంగా తెలంగాణ మేధావి వర్గం, యువత, విద్యార్థులు అంతా కూడా ఈ జీవోలను వ్యతిరేకించాలన్నారు. ఇప్పటికే గ్రూప్ -1 లో స్థానికత అంశం కారణంగా తెలంగాణ విద్యార్థులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టటం ఖాయమన్నారు.

The post Telangana MBBS Local Quota: Kavitha Raises Objections to GO 33, GO 150 appeared first on Telangana Jagruthi.

Kalvakuntla Kavitha Focuses on Telangana Local Body Elections, Holds Key Leaders’ Meetings
స్థానికంలో సత్తా చాటేలా కవిత వ్యూహ రచన

పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు

గ్రేటర్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పార్టీ శ్రేణుల సమాయత్తం

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమైన కవిత సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. రాబోయే జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు పార్టీ నేతలు, క్యాడర్ ను సమాయత్తం చేయడంతో పాటు రాబోయే కాలంలో పార్టీ నేతలు, క్యాడర్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. నిజామాబాద్, కొడంగల్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలపై ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు.. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన తర్వాత తెలంగాణ రక్షణసేన స్పందించిన తీరుతోనే ప్రభుత్వం దిగివచ్చిందని కవిత గుర్తు చేశారు.

ఏళ్లకేళ్లుగా రిమ్స్ హాస్పిటల్ ను పట్టించుకోని ప్రభుత్వం తక్షణ చర్యల కోసం రూ.11 కోట్లు రిలీజ్ చేసిందని, కలెక్టర్ రిమ్స్ హాస్పిటల్ సమస్యలపై రివ్యూ చేసి చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి నివేదించారని వెల్లడించారు. తాను ఆస్పత్రిని విజిట్ చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన తర్వాతనే ప్రభుత్వం దిగివచ్చి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా తెలంగాణ రక్షణసేన నాయకులు, కార్యకర్తలు తక్షణం స్పందించి వారికి అండగా నిలవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం  కార్పొరేషన్ లు, సిద్దిపేట సహా ఇతర మున్సిపాలిటీల్లో పోటీ చేసి సత్తా చాటాలని నేతలకు సూచించారు.

బుధవారం వరకు..

ఉమ్మడి జిల్లాల వారిగా నిర్వహిస్తున్న సమావేశాలు బుధవారం వరకు కొనసాగనున్నాయి.. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, బుధవారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో కవిత సమావేశం కానున్నారు. గ్రేటర్  కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

The post Kalvakuntla Kavitha Focuses on Telangana Local Body Elections, Holds Key Leaders’ Meetings appeared first on Telangana Jagruthi.

Telangana Jagruthi Bathukamma 2026: Guinness World Record Target with 2.5 Lakh Participants, Says Kalvakuntla Kavitha
వచ్చే ఏడాది గిన్నిస్ రికార్డు సాధించేలా బతుకమ్మ వేడుకలు

ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో, విదేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తాం

తెలంగాణ సాంస్కృతిక వికాసం.. మహిళా సాధికారత కోసం తెలంగాణ జాగృతి మరింత విస్తృతంగా పని చేస్తుంది

-తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

రాష్ట్ర కమిటీ, పలు జిల్లాల కమిటీలు, వివిధ దేశాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం

తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాలు పోస్టర్, బతుకమ్మ పాటలు సీడి ఆవిష్కరణ

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

వచ్చే ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు పోస్టర్, తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడిని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాలు గిన్నిస్ రికార్డు సాధించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నించినా అవి సఫలం కాలేదన్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో, విదేశాల్లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది బతుకమ్మ ఔన్నత్యాన్ని చాటేలా రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని.. ఇందుకోసం గ్రామ గ్రామ బతుకమ్మ కమిటీలు, కోలాటం కమిటీలు వేస్తామన్నారు. బూర్జ్ ఖలీఫాతో సహా ప్రపంచానికి బతుకమ్మ వైభవాన్ని చాటిన స్వచ్ఛంద సంస్థగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ విజయవంతం చేస్తామన్నారు. ఈ ఏడాది జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో తెలంగాణలోని మహిళలంతా పాల్గొనాలని కోరారు. చప్పట్ల పాటలు, సాంప్రదాయ బతుకమ్మ పాటలను భావి తరాలకు అందించేందుకే చప్పట్ల పాటలతో సీడి రూపొందించామన్నారు.

గిన్నిస్ రికార్డ్ సాధిస్తాం – మాధవి

వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ నిర్వహించి గిన్నిస్ రికార్డ్ సాధిస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి తెలిపారు. ఈ ఏడాది జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు.. జాగృతి నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని కోరారు. ఇప్పటికే యూట్యూబ్ లో చప్పట్ల, సాంప్రదాయ బతుకమ్మ పాటలను అప్ లోడ్ చేశామని ఆమె చెప్పారు.

సాంస్కృతిక వికాసం.. మహిళా సాధికారతే తెలంగాణ జాగృతి లక్ష్యం

తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఈ గడ్డ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ ఇక ముందు అంతకన్నా ఉత్సాహంగా పని చేయనుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా మారిపెల్లి మాధవిని నియమించారు. తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం కోసం చేసేలా సంస్థను మరింత బలోపేతం చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. సాంస్కృతిక వికాసంతో మహిళా సాధికారత, సమాజంలోని అసమానతలు రూపుమాపేలా జాగృతి మరింత విస్తృతంగా పని చేయనుందని కవిత ప్రకటించారు. ఈ క్రమంలోని రాష్ట్రంలోని పలు జిల్లాలు, వివిధ దేశాలకు కమిటీలను ప్రకటించారు. మిగిలిన జిల్లాల కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ

అధ్యక్షులు మారిపెల్లి మాధవి

ఉపాధ్యక్షులు జాడి శ్రీనివాస్, పర్శ చంద్రశేఖర్

ప్రధాన కార్యదర్శి గుంటి సుందర్

కార్యదర్శులు కన్నం శారద, దొండి స్వర్ణలత, మస్తాన్

మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మానుకోట సునీత

వివిధ జిల్లాల అధ్యక్షులు

జగిత్యాల పట్టూరి తిరుపతి

రంగారెడ్డి ఎండీ మొయినుద్దీన్

వరంగల్ పొలుదాసరి రమేశ్

హన్మకొండ నెట్టి రజిత

మహబూబ్ నగర్ ఏర్పుల నర్సింలు

సూర్యాపేట లక్కపాక ప్రవీణ్

భూపాలపల్లి గుమ్మడి రవీందర్

నిజామాబాద్ అవంతి కుమార్

పెద్దపల్లి మేడారపు రాజ్యలక్ష్మీ

కరీంనగర్ గుండు మంజుల

కామారెడ్డి రెడ్డిపేట సతీశ్ కుమార్

తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వేణుగోపాల్ యాదవ్ ను నియమించారు

జాగృతి వివిధ దేశాల అధ్యక్షులు

న్యూజిలాండ్ అధ్యక్షులు ముద్దం అరుణ జ్యోతి

ఖతార్ అధ్యక్షులు ప్రవీణ లక్ష్మీ

ఖతార్ ప్రధాన కార్యదర్శి ఆదర్శ రెడ్డి పోతుల

యూఎస్ఏ అధ్యక్షులు రాజ్ గోవిల్కర్

ఓమన్ అధ్యక్షులు గుండు రాజేందర్ నేత

కెనాడా అధ్యక్షులు కుందె రాఘవేంద్ర యాదవ్

ఐర్లాండ్ అధ్యక్షులు సంతోష్ పల్లె

స్విట్జర్లాండ్ అధ్యక్షులు కిశోర్ తాటికొండ

ఇటలీ అధ్యక్షులు సౌమ్య పిన్నంరెడ్డి

నార్వే అధ్యక్షులు కిరణ్ తేజ సూధటి

నార్వే ప్రధాన కార్యదర్శి నిఖిత బిల్లకంటి

జింబాబ్వే అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గౌడ్

కెన్యా అధ్యక్షులు గంట్ల స్వప్నా రెడ్డి

తెలంగాణ జాగృతి చప్పట్ల పాటల కోసం తెలంగాణ జాగృతి వెబ్ సైట్ లింక్ ఇస్తున్నాం.. క్లిక్ చేయగలరు 👇

The post Telangana Jagruthi Bathukamma 2026: Guinness World Record Target with 2.5 Lakh Participants, Says Kalvakuntla Kavitha appeared first on Telangana Jagruthi.

Kavitha Slams Telangana Govt Over RIMS Deaths, Announces Khairatabad Bypoll Contest
చిన్నారుల ఉసురు తీస్తున్న సర్కార్

ప్రభుత్వం బాధ్యత రాహిత్యంతో ఏటా 4 వేల మంది మృతి

పరిపాలన చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలి

విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వంపై ఇక యుద్ధమే

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, బంజారాహిల్స్, హైదరాబాద్)

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏటా వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వైద్యం, విద్య విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ రక్షణసేన ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో జరిగిన ఘటనపై బాధపడని వారుండరని కవిత గుర్తు చేశారు.

కేవలం ఈ ప్రభుత్వం బాధ్యతరాహిత్యం కారణంగానే పిల్లలు మాడిమసయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిధులే విదిల్చరు

ఆదిలాబాద్ ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉన్న పరిస్థితిపై సేకరించిన సమాచారం చూసిన తర్వాత రెండు రోజుల పాటు నిద్రపట్టలేదని కవిత చెప్పారు. అత్యంత భయంకరమైన చేదు వాస్తవాలు అందులో నివేదికలో ఉన్నాయన్నారు. 2020-21 లో 6000, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది పసిపిల్లలు చనిపోయారని వెల్లడించారు. ఏ జిల్లాలో చూసినా దాదాపు 200 మంది పిల్లలు చనిపోయినట్లు రికార్డులు తెలుపుతున్నాయన్నారు. ప్రభుత్వం న్యూయార్క్, డల్లాస్ చేస్తామన్న హైదరాబాద్ లో గతేడాది 1046 మంది పిల్లలు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యానికి 10 శాతం బడ్జెట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 5 శాతం మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. గతేడాది రూ.13,192 కోట్లు కేటాయిస్తే రూ. 9, 242 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కవిత తెలిపారు.

ప్రభుత్వం రూ. 22 ఖర్చు చేస్తే అందులో రూపాయి మాత్రమే వైద్యానికి ఇస్తున్నారని విమర్శించారు. కేటాయించిన బడ్జెట్ లోనే రూ.3 వేల కోట్లు వాడలేదన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రూ. 1900 కోట్లు కేటాయించారని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ కడిగిపారేసిందని కవిత వివరించారు. ఉన్న వాటిని ఖర్చు చేయకుండా మళ్లీ కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 11 వివిధ ఆరోగ్య పథకాలుంటే వాటిలో 7 హెల్త్ స్కీమ్ లకు బడ్జెట్ లో నిధులే కేటాయించలేదని కవిత చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి రూ.500 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. నిమ్స్ లో ముఖ్యమంత్రి చెబితే గానీ బెడ్ దొరికే పరిస్థితి లేదని కవిత చెప్పారు. సర్జరీ కావాలంటే దాదాపు 7 నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నీలోఫర్ హాస్పిటల్ లో 200 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంటున్నదని.. డాక్టర్లు, వైద్య సిబ్బంది శక్తికి మించి పనిచేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీకి రూ. 700 కోట్లు కేటాయిస్తే రూ.140 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని కవిత తెలిపారు.

మనమే సరి చేద్దాం

కలెక్టర్లు ప్రభుత్వ హాస్పిటళ్లు, హాస్టళ్లను ఎందుకు విజిట్ చేయటం లేదని కవిత ప్రశ్నించారు.

చిన్న జిల్లాలే కదా.. కలెక్టర్లు తరచూ సందర్శిస్తే పరిస్థితి మారుతుందని సూచించారు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇంత మంది పిల్లలు చనిపోతే కూడా ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా పోయిందన్నారు. రిమ్స్ ఘటన జరగటంతో హెల్త్ మినిస్టర్ ఆదిలాబాద్ వెళ్లారు.. కానీ గత మూడేళ్లలో ఎప్పుడూ ఆయన ఆదిలాబాద్ జిల్లాకే వెళ్లలేదని విమర్శించారు. పైగా వచ్చిన రోజు హెలికాప్టర్ లో ఇంధనం అయిపోందని గొడవపడ్డాడే తప్ప..ప్రజల కోసం కలెక్టర్ తో మాట్లాడలేదని విమర్శించారు. రిమ్స్ హాస్పిటల్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు, మంత్రులు వెళ్తున్నా ఈ సమయంలో కూడా హాస్పిటల్ లో పరిస్థితులు అలాగే ఉన్నాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాన్ని సరిచేసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఈ విషయంలో ప్రజలంతా కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటళ్లను సందర్శిస్తామని కవిత ప్రకటించారు. మీ ప్రాంతంలో ఉన్న ప్రతి హాస్పిటల్ కు వెళ్లి అక్కడ పరిస్థితులను ఫోటోలు తీసి ప్రశ్నించాలని యువతను కోరారు. ఈ ప్రభుత్వం తోలు తీసైనా సరే పరిస్థితులను మనమే బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు.

స్కూళ్లలో వాష్ రూములేవి

తెలంగాణ ప్రభుత్వం బాధ్యత లేని కారణంగా ఆడపిల్లల ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నదని కవిత ఆరోపించారు. శానిటరీ ప్యాడ్స్ పడేసేందుకు కూడా జాగ లేదన్నారు. రాష్ట్రంలో చాలా స్కూళ్లలో వాష్ రూములు కూడా లేవని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లి స్కూళ్లను పరిశీలించాలని సూచించారు. వాష్ రూములు లేని స్కూళ్లు ఉంటే టీఆర్ఎస్ తరఫున చందా వేసుకొని కట్టిద్దామని పిలుపునిచ్చారు. ఐటీడీఏలో రూ.300 కోట్లు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం వాడుకోవటం లేదని చెప్పారు. విద్య, వైద్యం మీద ఫోకస్ చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలం తీసుకున్న ప్రైవేట్ హాస్పిటళ్లు 25 శాతం వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

గజం కబ్జా చేసినా తీసుకోండి

తన ఫామ్ హౌస్ లో గజం భూమి కూడా కబ్జా ల్యాండ్ లేదని.. ఎఫ్టీఎల్ లో కూడా లేదని కవిత చెప్పారు. చట్టానికి లోబడే ప్రతి పైసా సంపాదించుకున్నానన్నారు. భవిష్యత్ లోనూ అలాగే ఉంటానని స్పష్టం చేశారు. అఫిడవిట్ లో ఉన్న దానికన్నా రూపాయి ఎక్కువ చూపించినా వారికే ఆ ఆస్తి ఇచ్చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డిది చేతగానీ, ఫెయిల్యూర్ సర్కార్ అని కవిత దుయ్యబట్టారు. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, ఇంకో కేసు అంటూ సిట్ వేశారు గానీ ఆ తర్వాత ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లపై వేసిన సిట్ ద్వారా కూడా ఏం చర్యలు ఉండవని తేల్చి చెప్పారు. అంతర్గతంగా బీఆర్ఎస్, రేవంత్ మధ్య ఒప్పందాలు ఉంటాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి సిరిసిల్లకు వెళ్లి నెరేళ్ల బాధితులకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వారిపై దాడి చేసి పోలీసులను శిక్షించలేదన్నారు. ఎస్సీ కమిషన్ నివేదిక కూడా రాలేదన్నారు. వీటిపై చెప్పకుండా ముఖ్యమంత్రి సిరిసిల్లలో సభ పెడితే అది పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడదని స్పష్టం చేశారు. సాగునీరు, తాగునీరు విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయని.. త్వరలోనే వాటిపై కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

ఉపఎన్నికకు సిద్ధం

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కచ్చితంగా అభ్యర్థిని నిలుపుతామని వెల్లడించారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అనుమతించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. లేదంటే రాజ్యాంగం, చట్టం అవసరం లేదని మనమే చెప్పినట్లు అవుతుందని హెచ్చరించారు. ఎస్ఐఆర్ విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొన్నదని కవిత చెప్పారు. రీ ఎడిట్ ఆప్షన్ లేదని, చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్స్ తో చాలా ఓట్లు తీసేస్తున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడమేనని స్పష్టం చేశారు.

The post Kavitha Slams Telangana Govt Over RIMS Deaths, Announces Khairatabad Bypoll Contest appeared first on Telangana Jagruthi.

RIMS Adilabad Fire: K Kavitha Visits Families of Five Infants
అమ్మతనమంటే ఇదే

(లోక రవిచంద్ర)

అప్పుడే ఊపిరి పోసుకుని అనారోగ్యంతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారుల బతుకులను ప్రభుత్వ నిర్లక్ష్యం చిదిమేసింది. బాధ్యత తీసుకుని అభయం ఇవ్వాల్సిన సర్కారు ప్రతినిధులు పిక్నిక్ కు పోయొచ్చినట్లు చేసి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలోనే మారుమూల జిల్లా ఆదిలాబాద్..అక్కడి జనమంటే అధికారులకు అలుసు. ఆదివాసులంటే మరీ చిన్నచూపు.  సర్కారు దవాఖానలో నిర్వహణ లోపంతో ఐదుగురు పిల్లల ఊపిరాగిపోతే సీఎంకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. పదిహేను రోజుల్లోపు వయసున్న పసిగుడ్లు తమ కళ్లముందే చితికిపోతే కన్నోళ్ల కన్నీళ్లు ఆపడం ఎవరితరం. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పే నేతలే కరవయ్యారు. ఇలాంటి సందర్భాల్లోనే అమ్మతనమంటే తెలిసొచ్చేది..

రిమ్స్ ఘటనపై కవిత ఆవేదన

ఆదిలాబాద్ రిమ్స్ లో ఏసీలో మంటలొచ్చి ప్రాణాపాయ స్థితిలో పసికందులు అల్లాడుతున్న విషయం తెలినప్పటి నుంచి తెలంగాణ రక్షణసేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విలవిల్లాడిపోయింది. తెల్లారే సరికే ఇద్దరు చిన్నారుల బతుకులు తెల్లారిపోయాయి. పిల్లల యూనిట్లో చికిత్స కోసం ఉన్న 27 మందిలో మంటల ధాటికి వెలువడ్డ పొగతో అప్పటికే ఇద్దరి ఊపిరాగిపోయింది. మిగతా వారిని ప్రైవేటు దవాఖానకు తరలించారు. దారిలోనే మరో ప్రాణం పోయింది. వార్త తెలిసినప్పటి నుంచి ఆందోళనలో ఉన్న కవితలోని అమ్మతనం తట్టుకోలేకపోయింది. ఉన్నఫలంగా ఆదిలాబాద్ బయలుదేరాలనుకుంది..కానీ ప్రభుత్వ సహాయక చర్యలకు తమ పర్యటన ఆటంకం కావద్దనుకుంది. సాయంత్రం వరకు వేచి చూసింది. వైద్య, ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ సంఘటన స్థలానికి వస్తున్నారని తెలిసి  కొంచెం ఊరట చెందారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు భరోసా లభిస్తుందని ఆశపడ్డారు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ స్పందన కనిపించింది. కష్టాల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ఆసరా కావడం మాట పక్కన పెడితే ప్రభుత్వ ఓదార్పుకు కూడా వారు నోచుకోలేదు. ఈ ఘటన కవితను మరింత కలచివేసింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యం దారుణంగా అనిపించింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన చిన్నారుల అంత్యక్రియలకు కూడా ఆర్థిక సాయం చేయలేదు. పాలకులంటే అజమాయిషీ చేసే అధికారులు కాదు..ఆపదలో మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించాల్సిన పెద్దలు. ప్రజలకు అన్ని వేళలా అండగా ఉండాల్సిన పెద్ద దిక్కు. అందునా పేదలకు ఆపద వస్తే వారి చూపు సర్కారు వేపే ఉంటుంది. కానీ రేవంత్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మానవత్వానికి చోటే లేకుండా పోయింది.

బాధిత కుటుంబాలకు కవిత ఆర్థిక సాయం

ఆదిలాబాద్ రిమ్స్ లో దుర్ఘటన బాధితులకు కావలసింది తక్షణ ఊరట..మేమున్నామంటూ భరోసా ఇచ్చే పాలకులు. కానీ వ్యాపార దృక్పథంతో సాగుతున్న పాలనలో అంతకు మించి ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అప్పటి వరకు బాధితుల కోసం ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమోనని ఎదురు చూసిన కవితమ్మలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలియనితనం ఒంటి నిండా నింపుకున్న రేవంత్ సర్కారుపై అసహ్యం కలిగింది. మర్నాడే ఆదిలాబాద్ పర్యటనకు పూనుకుంది. బాధితులకు కావలసింది వ్యక్తిగత ఓదార్పు..వారి కన్నీళ్లు తుడిచే అమ్మతనం. వారి బాధను అర్థం చేసుకునే ఆపన్నహస్తం. అప్పటికప్పుడు పార్టీ తరపున బాధిత కుటుంబాలకు తలా రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రాత్రికి రాత్రే స్థానిక నాయకుల చేత బాధిత కుటుంబాలకు అందేలా పురమాయించింది. మర్నాడు తెల్లవారకముందే బయలుదేరి ఆదిలాబాద్ చేరుకుంది కవిత. దుర్ఘటన జరిగిన రిమ్స్ ను సందర్శించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కనీస జాగ్రత్తలు తీసుకోలేని అధికారుల వైఫల్యాన్ని బయటపెట్టింది. కవితలోని ఆర్తిని చూసిన అక్కడి సిబ్బంది తమ బాధలను కూడా వెల్లబోసుకున్నారు. ఆమె ఆదిలాబాద్ చేరే సమయానికి చికిత్స  పొందుతున్న మరో ఇద్దరు చిన్నారులు కూడా కన్నుమూశారు. ఇది ఆమెను మరింత బాధించింది. అక్కణ్ణుంచి వెంటనే వేర్వేరు గ్రామాల్లో ఉన్న బాధిత కుటుంబాలను కలుసుకుంది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లులను ఓ అమ్మలా.. తోబుట్టువులా పలకరించి ఓదార్చింది. వారికి ధైర్యం చెప్పింది. పుట్టిన పదిహేను రోజులకే నూరేళ్లు నిండిన తమ పిల్లలను తలచుకుని శోకసంద్రంలో ఉన్న వారికి ఈ సమయంలో కావలసింది ఇలాంటి పలకరింపే..

పాలకుల మానవీయ స్పందనపై ప్రశ్నలు

ఆపదలొచ్చినప్పుడు పేదలు తమ వైపే చూస్తారన్న సోయి పాలకుల్లో లేకుండా పోతున్నది. రైళ్లు గుద్ది పసిపిల్లల ప్రాణాలు పోయినా..బస్సులు బోల్తాపడి ప్రయాణికులంతా లోయలో సమాధైనా కుర్చీలోంచి లేవలేనంత అహంకారం ఆనాటి పాలకులదైతే ఐదుగురు చిన్నారులు అగ్ని ఆహుతైనా కదల్లేని మానసిక దౌర్భల్యం ఈనాటి పాలకులది. నిత్యం హింసాత్మక సంఘటనలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు బండబారుతున్నాయి. సున్నితత్వమనే పదార్థం పాలకులు తమ మెదళ్ల నుంచి క్రమంగా తొలిగించుకుంటున్నారు. పాలనంటే వ్యాపారంగా మారిపోయింది. అన్నీ ఓట్ల లెక్కన లెక్క కట్టాల్సిందే. బాధితులకు ఓదార్పు.. అన్నార్థులకు భరోసా..ఆపన్నులకు అండ అనేది ఇప్పటి నేతలకు ఆలోచనలకు అందని..అంటని అంశంగా మారింది. అందుకే అమ్మతనం లేని పాలన ఆత్మలేని శరీరం లాంటిది.

The post RIMS Adilabad Fire: K Kavitha Visits Families of Five Infants appeared first on Telangana Jagruthi.

RIMS Adilabad Fire: K Kavitha Demands ₹50 Lakh Ex Gratia for Families
రిమ్స్ లో చిన్నారుల మృతి ప్రభుత్వ హత్యలే

దత్తత తీసుకున్న జిల్లాలో చిన్నారులు చనిపోతే ముఖ్యమంత్రికి వచ్చే తీరిక లేదా?

హెల్త్ మినిస్టర్ ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి బాధ్యత లేకుండా వ్యవహరించారు

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

పెండింగ్ బిల్లు చెల్లించకుంటే..ఆదివాసీలతో కలిసి ఘెరావ్ చేస్తాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎన్ సీయా పరిశీలన

(తెలంగాణ రక్షణసేన, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్)

రిమ్స్ లో జరిగిన ఘటన కేవలం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ఫలితమేనని తెలంగాణ జాగృత రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటననో, ప్రకృతి ప్రకోపం కారణంగానో జరగలేదన్నారు. రోజులు కూడా నిండకముందే ఐదుగురు పసివాళ్లకు నిండు నూరేళ్లు నిండాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ పేలిన ఘటనలో అగ్ని ప్రమాదానికి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఆదిలాబాద్ రిమ్స్ ను కవిత బుధవారం సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దవాఖానలో వైద్య సదుపాయాలు, సేవలు, సిబ్బంది సంఖ్యపై ఆరాతీశారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ సమస్యలను కవితకు వివరించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగింది హృదయవిదాకరమైన సంఘటన అన్నారు. ఇక్కడ ఇదే మొదటి సంఘటన కాదని.. ఈ హాస్పిటల్ లో గతేడాది 204 మంది, అంతకుముందు ఏడాది 174 మంది చిన్నారులు చనిపోయారని కవిత చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులపై ప్రభుత్వం బేరీజు వేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాస్పిటల్ కు వచ్చేందుకు సరైన రోడ్లు లేవన్నారు. ఏ రోజు పేపర్ చూసినా గర్బిణి మృతి.. చిన్నారులు మృతి అనే వార్తలే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి గురించి వార్తలు రాసి, కథనాలు ప్రచురించి మీడియా వాళ్లే విసిగిపోయారని చెప్పారు.

సీఎంకు తీరిక లేదు

రిమ్స్ లాంటి పెద్ద దవాఖనలో 150 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట సగం మంది కూడా లేరని, నర్సులు సగం మందే ఉన్నారని కవిత విమర్శించారు. శానిటేషన్ సిబ్బంది 20 శాతం మాత్రమే ఉన్నారన్నారు. సిబ్బందితో నడ్డి విరిగేలా పనిచేయిస్తూ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 ఏసీలు ఉంటే ఒక్క మెకానిక్ లేడని.. ముగ్గురు ఎలక్ట్రీషియన్స్ మాత్రమే ఉన్నారని, వారిని ఎన్నో పనులకు వాడుకుంటున్నారని కవిత విమర్శించారు. ఈ సంఘటనకు హాస్పిటల్ సిబ్బంది గానీ పేషెంట్లది గానీ తప్పు కాదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ దవాఖానకు రూ. 500 కోట్ల రావల్సి ఉన్నాయని కవిత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని ముఖ్యమంత్రి చెప్పారని, దత్తత తీసుకున్న జిల్లా పరిస్థితి ఇలా ఉంటుందా? ఐదుగురు పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా అని ప్రశ్నించారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం ఉంటుంది కానీ..మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూసే టైమ్ కూడా ముఖ్యమంత్రికి లేదా అని నిలదీశారు. హెల్త్ మినిస్టర్ వచ్చి ఇక్కడ కనీసం గంటన్నర కూడా లేరని, ఆయన వచ్చి కలెక్టర్ తో సమీక్ష నిర్వహించలేదని చెప్పారు. ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి వెళ్లారని దుయ్యబట్టారు. పేదలైన బాధిత కుటుంబాలకు కనీసం పైసా సాయం చేయలేదని, ప్రభుత్వం చేసిన తప్పులకు పరిహారం కాదు ఫైన్ కట్టాలని స్పష్టం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన తప్పునకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు.

అధ్యయనానికి టీఆర్ఎస్ కమిటీ

జనంబాటలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడే ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వానికి చెప్పామని కవిత గుర్తు చేశారు. అడవులతో పచ్చగా ఉండే ఆదిలాబాద్ లో క్యానర్ పేషెంట్లు పెరుగుతున్నారని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించి కమిటీ వేస్తామని ప్రకటించారు. ఆ కమిటీ ద్వారా అన్ని అంశాలపై స్టడీ చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. ఒక్క రిమ్స్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో పరిస్థితులు బాగా లేవన్నారు. వరంగల్ ఎంజీఎంలో పై కప్పు కూలిందని, నాగర్ కర్నూల్ లో ఎలుకలు కొరికి ఈసీజీ మెషీన్ పనిచేయటం లేదని కవిత చెప్పారు. కచ్చితంగా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫోరెన్సిక్ అడిట్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్ లో హెల్త్ కోసం 10 శాతం బడ్జెట్ కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని వెల్లడించారు. దాంట్లో సగం జీతాలకే పోతున్నదని, ఇక మౌలిక సదుపాయాలకు ఆ నిధులు ఏం సరిపోతాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఉచిత విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ విషయంలో తాము రాజకీయం చేయమని చెప్పారు. ముఖ్యమంత్రికి నెల రోజులు సమయం ఇస్తున్నాం.. ఈ లోగా పెండింగ్ బిల్లులు చెల్లించి…ఈ ప్రాంతంలో రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్యంగా వచ్చి పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ఎస్టీల కోసం వస్తున్న నిధులకు సంబంధించి కూడా లెక్క చెప్పాలన్నారు.

లేకుంటే మొత్తం ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్ ను ఘోరావ్ చేస్తామని ప్రకటించారు. ఆశామాషీగా వచ్చి చూసి పోయే వాళ్లం కాదని, ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కారం అయ్యే వరకు ఫైట్ చేస్తామని కవిత స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో శిశువులు, గర్భిణీల మరణాలు, వైద్య ఆరోగ్య సేవలపై టీఆర్ఎస్ పార్టీ తరపున అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. కమిటీ సమగ్ర అధ్యయనం చేసి పరిష్కారాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.

The post RIMS Adilabad Fire: K Kavitha Demands ₹50 Lakh Ex Gratia for Families appeared first on Telangana Jagruthi.

Adilabad RIMS Fire: K Kavitha Questions Government Response, Announces Aid for Families
డాక్టర్ల కన్నా మంత్రి నిర్లక్ష్యమే బాధించింది

ఆదిలాబాద్ హాస్పిటల్ లో ప్రమాదం మానవతప్పిదమే

ముగ్గురు చిన్నారులు చనిపోతే బాధిత కుటుంబాలకు పైసా సాయం చేయరా?

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

బాధిత కుటుంబాలను పరామర్శించనున్న కవిత

(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్, హైదరాబాద్)

ఆదిలాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లోని ఇంక్యుబేటర్ లో జరిగిన ప్రమాద ఘటనలో చిన్నారుల మృతి విషయంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యమే తీవ్రంగా బాధించిందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రమాదంలో  తల్లితండ్రులే తమ పిల్లలను కాపాడుకున్నారని వివరించారు. ఆదిలాబాద్ ఘటన నేపథ్యంలో మంగళవారం కవిత మీడియాకు వీడియో సందేశం పంపారు. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు చనిపోయారని, ఈ సంఘటన హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని తెలుస్తున్నదని విమర్శించారు. ఏసీ నిర్వహణ సరిగ్గా లేకపోవటంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారని, అంటే ఇది మానవతప్పిదం కారణంగా జరిగిందేనని స్పష్టమైందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందుతుందని భావిస్తామని, కానీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బాధితులకు సాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖానకు పేదలే వెళ్తారని, చనిపోయిన పిల్లల్లో ఇద్దరు మైనార్టీలు, ఒక ఆదివాసీ బాబు ఉన్నాడని కవిత వెల్లడించారు. ఆ జిల్లాకు వెయ్యి రోజుల తర్వాత వెళ్లిన హెల్త్ మినిస్టర్ ఇంతటి దుర్ఘటన జరిగితే అర్దగంట మాత్రమే అక్కడ ఉన్నాడని విమర్శించారు. హాస్పిటల్ సిబ్బంది కన్నా కూడా ఆయనే ఎక్కువ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని దుయ్యబట్టారు. హెల్త్ మినిస్టర్ వెళ్తున్నాడంటే బాధితులకు ఏదైనా సాయం చేస్తారని మేము భావించామని.. కానీ బాధితులకు సాయం చేస్తమని కూడా మంత్రి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మంత్రి వస్తున్నాడని అంత్యక్రియలు చేయాల్సిన కార్యక్రమాన్ని ఆపేశారని మండిపడ్డారు.

ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా.. మీరు ఫోటోలు దిగేందుకు ఈ సంఘటనను వాడుకుంటారా అని ప్రశ్నించారు. కనీసం అంత్యక్రియలు నిర్వహించలేని పేదవాళ్లు వారని, వారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు అందజేస్తామని ప్రకటించారు.

హెల్త్ మినిస్టర్ ఏదో టూరిజం స్పాట్ కు వెళ్లినట్లు వెళ్లారే తప్ప…సంఘటన మీద కనీసం రివ్యూ నిర్వహించలేదని కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి అడిట్ చేయించాలని కవిత డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సీలింగ్ కూలిందని, చాలా హాస్పిటళ్లలో ఎక్విప్ మెంట్ సరిగా లేదని చెప్పారు. వాటిపైన ముఖ్యమంత్రి ఆడిట్ నిర్వహిస్తేనే ప్రజలకు ఒక విశ్వాసం కల్పించనట్లు అవుతుందన్నారు. తాము ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని, తమ ప్రాధాన్యాల్లో హెల్త్ కూడా ఒకటని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.

బుధవారం ఆదిలాబాద్ కు కవిత

ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణసేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బుధవారం పర్యటించనున్నారు. రిమ్స్ అగ్ని ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు ఇచ్చోడకు చేరుకుంటారు. ఇచ్చోడలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుండి ఉట్నూరులో చిన్నారి కుటుంబ సభ్యులను  పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి సందర్శిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రి సందర్శించి రిమ్స్ లో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శిస్తారు.  ఆ  తర్వాత ఆదిలాబాద్ లో మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతారు.

The post Adilabad RIMS Fire: K Kavitha Questions Government Response, Announces Aid for Families appeared first on Telangana Jagruthi.

Panchajanya Sankalpa Sabha: Kalvakuntla Kavitha Says “I Am the Arrow of Bahujans” in Kosgi
నేను బహుజనుల బాణాన్ని

నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుతా

ఈ ముఖ్యమంత్రి బలవంతుడినని దురహంకారంతో వీర్రవీగుతున్నాడు

బలవంతమైన సర్పం చలిచీమల చేతిలో చిక్కి చచ్చినట్లే ఆయనకు పరాభావం తప్పదు

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, కోస్గీ-కొడంగల్) :

“నేను బహుజనుల బాణాన్ని.. యువజనుల యుద్ద నినాదాన్ని,. అంబేడ్కర్ వాదాన్ని.. ఫూలే గారి ఆత్మగౌరవ నినాదాన్ని.. సాయిత్రి బాయి పూలే ఆశయాలను నింపుకొని నిటారుగా నిలబడి మగమహారాజులకు ఛాలెంజ్ విసురుతున్న వీరవనితను నేను” అని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తనను బీఆర్ఎస్ వదిలిన బాణమని కొంతమంది, కాంగ్రెస్ బాణం అంటూ మరికొంతమంది చేస్తున్న విమర్శలకు కొడంగల్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గీలో ఆదివారం నిర్వహించిన పాంచజన్య సంకల్పసభలో కవిత మాట్లాడారు. తాను బహుజనుల బాణాన్ని అని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీలతో పోారాటం చేసి చూపిస్తానన్నారు. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎదగగలదని నిరూపిస్తానన్నారు. ఇన్నాళ్లు అయ్యల పాలనలో ఒరిగిందేమీ లేదని ఇక తెలంగాణలో మాతృస్వామ్యం తెచ్చుకోవల్సిన అవసరముందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే చేసేందేమీ లేదన్నారు. తనకు అవకాశం ఇస్తే ఒక తల్లిలాగా ఆలోచించి పాలన సాగిస్తానన్నారు.

ప్రజల కోసమే పార్టీ పెట్టా

తెలంగాణలో మాతృస్వామ్యాన్ని తెచ్చుకోవల్సిన అవసరముందని కవిత అన్నారు. ఇన్నాళ్లు అయ్యలు చేసిన పాలనలో మన బతుకులు ఏం మారాయో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాకముందు జరిగిన అన్యాయానికి ఆంధ్రోళ్లు బాధ్యులని అనుకున్నామని కానీ తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో మన బతుకులు ఏం మారాయని ప్రశ్నించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. బాధ్యతలేని పార్టీలు, నాయకుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కదనరంగంలో యుద్దం చేసే నాయకుల అవసరముందన్నారు. అందుకోసం తాను పార్టీ పెట్టి మీ ముందుకు వచ్చానని చెప్పారు. తనకోసమో, కొంతమంది నాయకుల కోసమో పార్టీ పెట్టలేదని, తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేందుకే తెలంగాణ రక్షణ సేన పెట్టానని చెప్పారు. కోస్గీకి తాను 2009 లో టీడీపీతో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చానని అన్నారు. వాళ్లిద్దరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారని తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే తాను కూడా రాష్ట్రాన్ని నడిపిస్తాననే విశ్వాసం ఉందన్నారు.

పాంచజన్యంతో ప్రజల జీవితాల్లో వెలుగులు

సమాజంలో ఆధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది ధర్మపోరాటాన్ని చేస్తారని….తాము కూడా తెలంగాణ రక్షణ సేన ద్వారా అదే పనిచేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు విద్య కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. జనంబాటలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే అక్కడి పరిస్థితిని ఓ మహిళ తనకు చెబుతుంటే ఎంతో ఆవేదన చెందానన్నాారు. తన బిడ్డకు పుట్టిన బిడ్డను చూడాలంటే వెయ్యి రూపాయలు లంచం అడిగారని ఆమె చెప్పిందన్నారు. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎంత పెద్ద జబ్బైనా సరే ఒక్క రూపాయి కూడా ప్రజలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను ఇవ్వన్నీ చెబుతుంటే కొంతమంది చిన్నపిల్ల, ఆడబిడ్డ అంటూ నవ్వుతున్నారని కవిత అన్నారు. కానీ తాను ఒక తల్లిని అని తల్లి హృదయంతో ఆలోచిస్తానని చెప్పారు. విద్య, వైద్యం కోసం లక్ష కోట్లు ఖర్చు అయినా పర్వాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూత్ ను నమ్మవద్దు అంటున్నాడు.. మరి ఆయన బూతులను నమ్మాలా అని ప్రశ్నించారు. మన యువతను నమ్మి వారి బిజినెస్ ఐడియాలను ప్రోత్సహించేందుకు 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఋణాలు ఇస్తామన్నారు.

పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే పేరు మార్చుకుంటా

రాష్ట్రంలో రైతుల పరిస్థితి పై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, కరెంట్, నీళ్లు, రైతు భరోసా, మద్దతు ధర ఇలా ప్రతి దానికి రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అధికారుల కాళ్లపై పడి రైతులు వేడుకుంటున్న సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయన్నారు. రైతులకు కనీసం సాగునీళ్లు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శించారు. జురాల వద్ద రెగ్యులేటర్ ను పగలకొట్టి రైతులు నీళ్లు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జురాల నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్నాసరే చేయటం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక జూరాల నుంచి నీటిని ఎత్తిపోసి కొడంగల్, మక్తల్, నారాయణపేట నుంచి ఇబ్రహీం పట్నం వరకు 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని భరోసా ఇచ్చారు. లేదంటే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు.

బలవంతుడినని వీర్రవీగుతున్న ముఖ్యమంత్రి

రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతున్నదని కవిత అన్నారు. ఏ వర్గానికి కూడా వారి జనాభాకు తగిన విధంగా అవకాశాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రి బలవంతుడనని వీర్రవీగుతున్నాడని…కానీ బలవంతమైన సర్పం చలిచీమల చేతిలో చనిపోయినట్లుగా ఆయనకు పరాభవం తప్పదన్నారు. రాష్ట్రంలో లంబాడాలు లేని తొలి ప్రభుత్వం ఇదేనని ఆమె చెప్పారు. ముస్లింలకు కూడా మొన్నటి వరకు కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదన్నారు. గత మూడేళ్లలో ముస్లింల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది 1500 కోట్లు మాత్రమేనని అన్నారు. లగచర్లలో లంబాడాలపై ఈ ముఖ్యమంత్రి చేసిన దాష్టీకాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. మక్తల్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దన్న టీచర్, రైతులపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాటం చేసినందుకు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో నర్సింహుల్ అనే రైతును పోలీసులు కొట్టి చంపారని ఆవేదనతో చెప్పారు. కుమ్మెర గ్రామంలో 2 నెలల చాకలి సామాజిక వర్గం చిన్నారి చనిపోతే ఇప్పటికీ చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే బహుజనం రాజ్యం రావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ ను గద్దె దించాల్సిందేనని అన్నారు. బీసీలకు, యువతకు అవకాశం ఇస్తున్న తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

కొడంగల్ లో ఇందిరమ్మ ఇళ్లకు కూడా డబ్బులు అడుగుతున్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కూడా డబ్బులు అడుగుతున్నారని కవిత చెప్పారు. ఇప్పటికీ నీళ్లు రాని ఎన్నో గ్రామాలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఇంజినీరింగ్ కాలేజ్ మళ్లీ వెనక్కి వెళ్లిందన్నారు. గట్టు, కేటిదొడ్డి మండలాల్లో అఫ్ఘానిస్తాన్ తో సమానంగా అక్షరాస్యత ఉందని…అందుకు సీఎం సిగ్గుపడాలన్నారు. విద్యాశాఖ మంత్రిగాను ఉన్న ముఖ్యమంత్రి రెండేళ్లలో పరిస్థితి మార్చాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ కు 13 సీట్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇండ్లలో డబ్బుల దందా చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.

కవిత నోట గద్దర్ పాట

కోస్గీ సభలో గద్దర్ పాటతో కవిత ఆకట్టుకున్నారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల తీరు గురించి చెబుతూ ఆమె గద్దర్ పాటను పాడారు. భలేగుంది అసెంబ్లీ అంటూ గద్దర్ గతంలో పాడిన పాటను పాడి వినిపించటంతో ప్రజలంతా పెద్ద ఎత్తున చప్పట్లతో హోరెత్తించారు.

కిక్కిరిసిన సభా ప్రాంగణం

కోస్గీ సభ ప్రాంగణం వేలమంది ప్రజలతో కిక్కిరిసి పోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కవిత రాకకోసం జనం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ప్రారంభమయ్యే సరికి ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. అంతకుముందు హైదరాబాద్ నుంచి కొడంగల్ కు 200 కార్లతో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వచ్చారు. హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ నుంచి కోస్గీ వరకు టీఆర్ఎస్ నాయకులు, మహిళలు కవితకు అడుగడుగునా మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.  కొడంగల్ నుంచి కోస్గీ వరకు  20 కిలీమీటర్ల దూరం కవిత ప్రత్యేక బస్సులో ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. కోస్గీ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన జెండాను కవిత ఆవిష్కరించారు.

సీఎం .. సీఎం నినాదాలతో మార్మోగిన సభ ప్రాంగణం

కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్పసభ ప్రాంగణం సీఎం.. సీఎం అనే నినాదాలతో మార్మోగింది.. కల్వకుంట్ల కవిత మాట్లాడేందుకు ముందుకు వచ్చిన సమయంలో ప్రాంగణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు సీఎం.. సీఎం అని నినాదాలు చేశారు.

చంద్రబాబు, రేవంత్ తర్వాత నేనే సీఎం

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తాను, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మహా కూటమి తరపున ప్రకారం చేశామని గుర్తు చేశారు. ఆ రోజు కోస్గి సభలో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి సీఎంలు అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో గెలిచి తాను సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

The post Panchajanya Sankalpa Sabha: Kalvakuntla Kavitha Says “I Am the Arrow of Bahujans”  in Kosgi  appeared first on Telangana Jagruthi.