కనుగుట్ట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత

(హైదరాబాద్) :
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్టలో ప్రమాదవశాత్తు వంద ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దహనం అవడంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పంట దహనమై నష్టపోయిన రైతులతో హైదరాబాద్ నుంచి కవిత ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ మౌనికతో కలిసి బాధిత రైతులతో ఫోన్ లో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని.. పంట నష్టం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా ఒత్తిడి చేస్తామని ధైర్యం చెప్పారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న పంట దహనమై నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.