తెలంగాణ జాగృతిలోకి చాకలి ఐలమ్మ వారసులు

(హైదరాబాద్)

చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మ,  చెల్లెలు జ్యోతి, శోభ శనివారం జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత  సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి  చెందిన చాకలి ఐలమ్మ వారసులను కవిత స్వయంగా కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్బంగా పద్మ, జ్యోతి, శోభ మాట్లాడుతూ నాడు భూస్వాములకు, రజాకార్లకు ఎదురొడ్డి పోరాటం చేసిన అమ్మమ్మ చాకలి ఐలమ్మ ప్రతీకగా కవితక్క ప్రభుత్వం పైన పోరాడుతున్నదని తెలియజేశారు. వెలుగుమట్లలో ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చితే పోరాడిన విధానం నచ్చి తాము కవితక్కకు అండగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Kavitha inducts Chakali Ilamma family members into Telangana Jagruthi