కువైట్లో ఘనంగా జన్మదిన వేడుకలు
కువైట్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షుడిగా ప్రమోద్ కుమార్ మార్క బాధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహించిన మొదటి కార్యక్రమంగా ఈ వేడుక ఎంతో విజయవంతంగా జరిగింది. తెలంగాణ జాగృతి కువైట్ సభ్యులు, తెలంగాణ సమాజ ప్రముఖులు, పలువురు అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ మార్క మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి కువైట్లో జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తూ ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం తనకు గర్వకారణమని తెలిపారు. తెలంగాణ జాగృతి కువైట్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, కమ్యునిటీ సంక్షేమ కార్యక్రమాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కవిత తెలంగాణ ప్రజల కోసం నిబద్ధతతో పోరాడుతున్న నాయకురాలని కొనియాడారు. కవితక్కకు ఆయురారోగ్యాలు కలగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తదనంతరం కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కువైట్ కోర్ టీమ్ సభ్యులు సురేష్ గొడిశాల, లవన్ కుమార్, రత్నాకర్ మామిడాల, వరం రాజశేఖర్, అనిత రామనాథం పాల్గొన్నారు.
ప్రత్యేక అతిథులుగా అభిలాష గొడిశాల, ఎం.ఎ. సుభాన్ సోహెల్ (గోల్డెన్ తెలంగాణ కువైట్ అధ్యక్షుడు), వసంత్ రాథోడ్ (బంజారా సేవా సమితి కువైట్ అధ్యక్షుడు), వారి కోర్ టీమ్ సభ్యులు, కువైట్ తెలంగాణ సమితి అధ్యక్షుడు జీకే గంగాధర్ పాల్గొని కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


సింగరేణి కార్మికుల మధ్య సంబరాలు
కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వద్ద సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సాంస్కృతిక విభాగం అందే సదానందం, జిల్లా నాయకులు బొగ్గుల సాయికృష్ణ, రవి, హెచ్ఎంఎస్ నాయకులు దబ్బట సతీష్ హాజరై మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కూడా కవితక్కను ప్రతి ఒక్క కార్మికుడు గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం కవిత ఎన్నో కార్యక్రమాలు చేశారని, 20 వేల ఉద్యోగాల కల్పనలు కవితక్క కృషి చాలా ఉందన్నారు. ఉచిత కరెంటు, ఉచిత ఏసి సౌకర్యము, కార్మికులకు వారి పిల్లల కోసం ఐఐటి, ఐఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు చదవడానికి ఫీజు రీయంబర్స్ మెంట్ ఇప్పించారని తెలిపారు. అంబేద్కర్ జయంతిని సెలవుదినంగా ప్రకటింపజేయడం కూడా కవితక్క కృషి ఫలితమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సతీష్, రామస్వామి, వేణు, శ్యామ్, అబ్బాస్, సాయికుమార్, చంద్రమౌళి వెంకటేశ్వర్లు, రాజు, శ్రీకాంత్, ప్రశాంత్, ఆంజనేయులు, నర్సింగ్, చిరుహాసన్, రత్నాకర్, సుధాకర్, వంశీ, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండలో ఘనంగా వేడుకలు
హన్మకొండలోని ఫాతిమానగర్ లో కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి రోహిత్, పోలంపల్లి రమేశ్, పాకనాటి హరి, ప్రశాంత్ తదితరులు పాల్గోని కేక్ కట్ చేశారు.
పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన పురస్కరించుకొని మెగా జాబ్ మేళా నిర్వహించారు. 86 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా జాబ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి సుమారు 86 మంది యువతకు ఆన్-ద-స్పాట్ జాబ్ ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
“సమాజం కోసం పోరాడే నాయకత్వం మాత్రమే నిజమైన రాజకీయాల అసలు అర్థాన్ని చూపిస్తుందన్నారు. మహిళా సాధికారత, యువత అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న కవితక్క స్ఫూర్తితోనే ఈ జాబ్ మేళాను నిర్వహించామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం మా లక్ష్యం” అని తెలిపారు. “అవకాశాలు మన దగ్గరకు వస్తే వాటిని పట్టుకునే ధైర్యం, కృషి, పట్టుదల యువతలో ఉండాలన్నారు. తెలంగాణ యువత ప్రతిభ ప్రపంచానికి తెలియజేయగల సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. సరైన దిశలో కృషి చేస్తే విజయాలు మీవే” అని ప్రోత్సహించారు. కవిత జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం తెలంగాణ జాగృతి లక్ష్యమని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు చందర్, శైలేష్ , ప్రభు, సత్యం తెలంగాణ జాగృతి నాయకులు గుండ సంజీవ్, నవీన్ గౌడ్, సన్నీ, సందీప్, రాజు యాదవ్, సమీర్, అఖిల్, సభ్యులు యువత, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








