నాగర్ కర్నూల్ దవాఖాన సందర్శన | (నగర్ కర్నూల్)




తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. మాతాశిశు కేంద్రంలోని ఎన్ఐసీయులో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల బెడ్లపై చీమలు పారుతుండటం చూసి చలించి పోయారు. వెంటనే నాగర్ కర్నూల్ హాస్పిటల్ ను బాగు చేయాలని కవిత డిమాండ్ చేశారు. 50 పడకల హాస్పిటల్ పైన ఒక ఫ్లోర్ వేసి 350 పడకల హాస్పిటల్ గా మార్చారని, దానికి తగ్గట్టు వసతులు పెంచాలన్నారు. కానీ అక్కడ 150 మంది శానిటేషన్ సిబ్బంది గానూ 50 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు.
దీంతో లేబర్ వార్డు, బాత్ రూమ్ లు క్లీన్ గా లేని పరిస్థితి ఉంది. వెంటనే శానిటేషన్ సిబ్బందిని పెంచాలని కోరారు.
నవజాత శిశువులు ఉండే యూనిట్ లో చీమలు పారుతుండటం దారుణమన్నారు. అరకొర వసతులున్నా సరే డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు.








