స్కాల్ ఇంటర్నేషనల్’  ప్రెసిడెంట్ గా ఎన్.ఎస్.ఎన్ మెహన్

అభినందించిన టీఆర్ఎస్ ఛీప్ కల్వకుంట్ల కవిత

తెలంగాణకు చెందిన వ్యక్తికి అత్యున్నత గౌరవం దక్కటం సంతోషమని వ్యాఖ్య

(తెలంగాణ రక్షణసేన కార్యాలయం, హైదరాబాద్):

ప్రపంచ పర్యాటక రంగంలో అత్యున్నత సంస్థ అయిన ‘స్కాల్ ఇంటర్నేషనల్’ (Skal International) సంస్థకు తెలంగాణకు చెందిన ఎన్.ఎస్.ఎన్ మొహన్ ప్రెసిడెంట్ గా ఎన్నికవటం గొప్ప విషయమని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.  2026 సంవత్సరానికి వైస్ ప్రెసిడెంట్ గా, 2027 లో ప్రెసిడెంట్ గా ఎన్.ఎస్.ఎన్ మొహన్ ఎన్నికయ్యారు. 94 ఏళ్ల సంస్థ చరిత్రలో ఏషియా నుంచి ప్రెసిడెంట్ గా ఎన్నికవటం ఇదే మొదటి సారి. అలాంటి గౌరవం తెలంగాణకు చెందిన వ్యక్తికి దక్కటం సంతోషంగా ఉందని కవిత అన్నారు. ఎన్.ఎస్.ఎన్ మొహన్ శనివారం బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కవిత అభినందించారు. ప్రపంచ పర్యాటక రంగంలో భారత దేశ కీర్తిని, తెలంగాణ ఖ్యాతి ఇనుమడింపజేయాలని సూచించారు.