జనం గోస పట్టని బీఆర్ఎస్, కాంగ్రెస్
-కల్వకుంట్ల కవిత
తెలంగాణ వ్యతిరేకులను చేర్చుకుంటున్న గులాబీ పార్టీ
కొత్త పార్టీని ఆదరించండి
(బంజారాహిల్స్ – తెలంగాణ జాగృతి కార్యాలయం)
రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రజలను బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని సమర్థించుకో చూస్తున్నని విమర్శించారు. వెయ్యి ఏండ్లయినా బీఆర్ఎస్ పార్టీ మారదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం కల్వకుంట్ల కవిత వీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలను తప్పు పట్టారు. ఈ నెల 25న జరిగే జాగృతి కొత్త పార్టీ ఆవిర్భావ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
వెయ్యేండ్లయినా బీఆర్ఎస్ మారదు
నిన్న జరిగిన రెండు సభల్లో బీఆర్ఎస్ ఉట్టి కథలు చెబితే కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది. ప్రజల వెతలు ఎవరూ చెప్పలేదు.నిన్న బీఆర్ఎస్ సభలో ప్రజల సమస్యలపై ప్రస్తావించకుండా ఉత్త కథలు చెప్పారు. జగిత్యాలలో 75 ఏళ్ల కురువృద్ధుడిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆ నాయకుడికి మీకు 25 ఏళ్ళు తగ్గాయి అని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంపై జీవన్ రెడ్డి పోటీ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉంటే నాకు తెలంగాణ గూర్చి ఎందుకు అని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గూర్చి బీఆర్ఎస్ ఎక్కడా మాట్లాడటం లేదు. 75 సంవత్సరాల కురువృద్ధుడు బీఆర్ఎస్ లో ఏమి చేస్తారు. తెలంగాణలో యూత్ లేరా..? మేము పెట్టబోయే కొత్త పార్టీలో యువతకు అవకాశాలు ఉంటాయి. మా పార్టీ రాజకీయాల్లో చేంజ్ తీసుకువస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. మహిళా బిల్లు, డీ లిమిటేషన్ పై ఒక్క మాట మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదు. తమ ఓటమికి కారణం మీరే అంటూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ బ్లేమ్ చేస్తున్నది. బీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు. వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదు. బీఆర్ఎస్ సభలో కేంద్ర ప్రభుత్వన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఎలాగూ లేదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక్క మాట లేదు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారిని బిచ్చగాళ్లుగా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. తలచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి.
యువతరానికి స్వాగతం
ఈనెల 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం..రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిస్తున్నాం. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా పార్టీ ఆవిర్భవ కార్యక్రమానికి వస్తున్నారు. కొత్త రాజకీయ పరిణామం జరుగబోతోంది కాబట్టి.. కొత్త పార్టీ ప్రచార హోర్డింగులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వానికి కార్మికులంటే లెక్క లేదు. ఆర్టీసీ సమ్మెకు మా పూర్తి మద్దతుంటుంది. ప్రభుత్వం ఆర్టీసీని ప్రవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నది. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. రాష్ట్రంలో మక్కలు కొనే దిక్కు లేదు.
సీఎం వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం
గుంటనక్క ఢిల్లీ వెళ్తే ముఖ్యమంత్రి డీల్ కుదుర్చేలా మాట్లాడతున్నారు. ఎవరు ప్రతి పక్షంలో ఉండాలో ఎవరు అధికారంలో ఉండాలనేది చెప్పడానికి సీఎం ఎవరు..? వచ్చే పదేళ్లలో అధికారంలోనే ఉంటామని మీరెలా చెబుతారు.. అది చెప్పాల్సింది ప్రజలు. కాళేశ్వరం కేసులో ఏదో జరుగుతుందని సీఎం అంటున్నారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసే విధంగా సీఎం మాట్లాడుతున్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు…? వచ్చే పదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఎలా ఉంటారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి డిసైడ్ చేయాలి కదా…? రెండు పార్టీలు బల ప్రదర్శన చేస్తున్నాయి. ప్రజల సెంట్రిక్ గా రాజకీయాలు రావాలి. ఆడబిడ్డగా కొత్త తరహా రాజకీయాలతో మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి.








