మరమనిషి అంటే మీరెందుకు స్పందిస్తున్నారు

కాంగ్రెస్ పై తెలంగాణ రక్షణ సేన ఫైర్

(టీఆర్ఎస్ కార్యాలయం, బంజారాహిల్స్)

రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా కవితమ్మ పూరించిన పాంచజన్యం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైందని తెలంగాణ రక్షణ సేన నాయకులు అన్నారు. 

కేసీఆర్ ను  ఉద్దేశించి కవితమ్మ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల కన్నా కాంగ్రెస్ నేతలు ఎక్కువగా స్పందించడం విచిత్రంగా ఉందన్నారు. పాంచజన్యంతో కవితమ్మ ప్రభంజనం తెలంగాణలో ఉంటుందని భావించే కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన ఎద్దేవా చేశారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నాయకులు లకావత్ రూప్ సింగ్, లోక రవిచంద్ర, డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, చిలుక ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ పెట్టిన కవితమ్మను ఆదిలోని తొక్కిపెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

K Kavitha speaking about PanchaJanya and Telangana politics during press meet in Banjara Hills

సమస్యలు పట్టించుకోకపోతే తిట్టమా..

ఎల్. రూప్ సింగ్, తెలంగాణ రక్షణ సేన నాయకులు

కల్వకుంట్ల కవితమ్మ మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వాఖ్యలను పట్టుకొని కన్న తండ్రిని తిట్టారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రజలు సమస్యల్లో ఉంటే బయటకు రాకుండా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రశ్నించటం తప్పా? తెలంగాణ వచ్చాక సామాన్య కార్యకర్తలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.. అది తప్పా? తప్పులు సరిదిద్దుకోవాలంటూ సూచించటం కూడా తప్పా? కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించటం లేదని అంటే దాన్ని కాంగ్రెస్ తప్పని అంటుందా? కవితమ్మపై కాంగ్రెస్ నేత రాములు నాయక్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజారాలకు మంత్రి పదవి లేకపోతే అడిగే దమ్ము లేని వ్యక్తివి నువ్వు. పదవుల కోసం కాంగ్రెస్ చుట్టూ తిరిగి ఇక ఏ పదవి రాదని మూలకు కూర్చున్నావ్. కవితమ్మను తక్కువ చేసేందుకు లిక్కర్ పేరుతో మాట్లాడుతున్నారు. 

ఆ కేసు అసలు కేసే కాదని కోర్టు తేల్చింది. అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెబుతోంది. అలాంటి కేసుపై కవితను బద్నాం చేసేలా మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తున్నా. రాములు నాయక్, వివేక్, దానం సహా కాంగ్రెస్ నాయకులకు కవితమ్మ గురించి మాట్లాడితే నైతిక హక్కు లేదు.

Telangana Rakshana Sena leaders addressing media on Kavitha comments and Congress reaction

కాంట్రాక్టుల కోసం పార్టీలు మారే మీరా..

శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ రక్షణ సేన నాయకులు

కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కవితమ్మ అంటే కాంగ్రెస్ నాయకులు అవాకులు, చెవాకులు పేలటం విస్మయానికి గురిచేస్తోంది. దానం, అడ్లూరి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు కేసీఆర్ పై చెప్పలేనంత ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు. పాంచజన్యం పేరుతో కవిత పార్టీ పెట్టటంతో కాంగ్రెస్ పార్టీకి జ్వరం పట్టుకుంది. ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్, బీఆర్ఎస్ పని ఖతమైందని కాంగ్రెస్ కు తెలుసు. ఇప్పుడు కవిత పెట్టిన పార్టీతో తమ పునాదులు కదులుతాయని కాంగ్రెస్ భయపడుతోంది. అందుకే కుట్రపూరితంగా కవితమ్మ మీద విమర్శలు మొదలుపెట్టారు. దానం నాగేందర్ కూడా కవితను విమర్శించటం చూస్తుంటే నవ్వొస్తున్నది. ఆనాడు సీమాంధ్రులతో కుమ్మక్కై హైదరాబాద్ ను యూటీ చేయాలని ప్రయత్నించిన వ్యక్తివి నువ్వు. సీమాంధ్రుల వైపు ఉండి కట్టలకు కట్టలు డబ్బు సంపాదించే ప్రయత్నం చేశావ్. నీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేసిన జాగృతి నాయకులపై దాడి చేశావ్. తెలంగాణకు ద్రోహం చేశావ్.. నీకు అవకాశం ఇచ్చిన పీజేఆర్ కు ద్రోహం చేశావ్. అసలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావో కూడా చెప్పుకోలేని దుస్థితి లో ఉన్నావ్. అధికారం ఎటు ఉంటే అటు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు నువ్వు. నువ్వా కవిత గారిని విమర్శించేది? తెలంగాణ వాదులు, విద్యార్థులపై దాడులు చేసిన నీకు కేసీఆర్ పై ప్రేమ ఎక్కడిది? 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ సచ్చిపోయిందంటూ మాట్లాడిన వ్యక్తి కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంట్రాక్ట్ కోసం బీజేపీలో చేరి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చిన నువ్వా నీతి వ్యాఖ్యలు చెప్పేది? కవితమ్మ పూరించిన పాంచజన్యంతో మీ వెన్నులో వణుకు పుడుతోంది. కర్కోటక ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిని అంటే మహేష్ కుమార్ గౌడ్ బాధపడిపోతున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రిని కర్కోటకుడు అనకుండా ఏమనాలి? మతా శిశు మరణాలు పెరిగాయి, అవుట్ సోర్సింగ్ వాళ్లకు జీతాలు ఇవ్వటం లేదు, రిటైరైన  ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. అలాంటి ముఖ్యమంత్రిని కర్కోటకుడు అనకుండా ఏమని పిలవాలి? కవిత పెట్టిన పార్టీ తెలంగాణ భవిష్యత్ కు ఆశాజ్యోతి అవుతుందని కాంగ్రెస్ కు భయం పట్టుకుంది. అందుకే కవితను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. 

ముందు పరిపాలనపై శ్రద్ధ పెట్టి ప్రజలకు మేలు చేయాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం.

Political discussion on KCR and governance issues raised by Kavitha in Telangana

నిధులు ఎటు పోతున్నాయో చెప్పాలి

చిలుక ప్రవీణ్, తెలంగాణ రక్షణ సేన నాయకులు

పార్టీ పెట్టి వారం రోజులు కూడా గడవకముందే కవితమ్మపై మూడు పార్టీలు దాడి చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు కూడా కొత్తగా పుట్టిన పార్టీ మీద దాడి చేయటం ఏంటి?

రాష్ట్రంలో బలమైన మహిళ నాయకత్వాన్ని రాకుండా చేయాలని ఈ మూడు పార్టీల నాయకులు కంకణం కట్టుకున్నారు. పాంచజన్యంతో కవిత చర్చకు పెట్టిన ప్రజా సమస్యలపై ఈ పార్టీలు మాట్లాడటం లేదు? ప్రజల సమస్యలు పక్కనపెట్టి… కవిత పార్టీ మీద కుట్ర చేసే దుస్థితిలో ఈ మూడు పార్టీలు ఉన్నాయి. కవిత పార్టీకి డబ్బులు ఎక్కడివి అంటూ కాంగ్రెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ ప్రజల సొమ్ము ఎక్కడికి పోతుందో ముందు ఆయన సమాధానం చెప్పాలి?  రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సొమ్మును ఎక్కడకు డంప్ చేస్తున్నాడో చర్చకు వచ్చే దమ్ముందా? చెవెళ్ల డిక్లరేషన్ లో దళితులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై మాట్లాడే దమ్ము లేదా? దళితుల రిజర్వేషన్లను పెంచాలని అడ్లూరి ఎందుకు ప్రశ్నించటం లేదు. మీలాంటి వ్యక్తులు దళిత నాయకులు కావటం నిజంగా దురదృష్టం. దళితుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. ముఖ్యమంత్రి సోదరులు దళితుల భూములు గుంజుకునే కుట్ర చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ప్రజల సమస్యలను వదిలి కవిత పెట్టిన పార్టీపై ఎందుకు మీ ఏడుపు? కవితమ్మ  కేసీఆర్ ను ఒక రాజకీయ నాయకుడిగా భావించి మాత్రమే విమర్శలు చేశారు. 

రాజకీయాల్లో కుటుంబ బంధాల కంటే కూడా ప్రజల సమస్యలే ముఖ్యం. బాధ్యత మరిచిన కేసీఆర్ కు ఆయన బాధ్యతను గుర్తు చేయటం తప్పా? తండ్రి పేరు వంక చూపిస్తూ కవిత ను విమర్శించాలని చూస్తే మహిళా లోకం ఊరుకోదని హెచ్చరిస్తున్నా. వచ్చేది తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వమే..కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేలాపనలు ఆపి…ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి.

Leaders criticizing Congress response to Kavitha remarks on Telangana leadership

పాలన చేతగాక ఎదురుదాడి

లోక రవిచంద్ర, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

పాంచజన్యం పేరుతో కవితమ్మ ప్రకటించిన అంశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల చెవుల్లో రక్తం కారేలా చేస్తున్నాయి. ప్రజల సమస్యలపై కవితమ్మ పోరాడుతున్న తీరు వారిని భయానికి గురిచేస్తోంది. అందుకే ఇష్టానురీతిగా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ను విమర్శిస్తే  మంత్రులు, అధికార కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. ప్రతిపక్షాన్ని విమర్శిస్తే అధికారం పక్షం ఉలిక్కిపడటం బహుశా దేశంలో ఎక్కడా ఉండదేమో? మాకు పాత కేసీఆర్ తో ఎలాంటి పంచాయితీ లేదు..మారిన.. మర మనిషి కేసీఆర్ తోనే పంచాయితీ. కర్కోటకుడి పాలనలో అరాచకాలు సాగుతుంటే ఫామ్ హౌస్ కు పరిమితమైన వ్యక్తిని విమర్శించటం తప్పా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను గౌరవిస్తాం. ప్రజల సమస్యలను మరిచిన కేసీఆర్ ను విమర్శిస్తాం. కవితమ్మ పార్టీ వచ్చి వారం రోజులు గడవకముందే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిజానికి పదేళ్లు బీఆర్ఎస్, రెండున్నరేళ్లు కాంగ్రెస్ ప్రజల సమస్యలు పట్టించుకుంటే కవితమ్మ పార్టీ పెట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు.

ప్రజల మీద సోయి లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయి. కవిత ఎత్తి చూపిన ప్రజ సమస్యలపై ముందు అధికార పక్షం స్పందించాలి?  కవితమ్మ క్యారెక్టర్ ను దెబ్బ తీసే విధంగా ప్రయత్నం చేస్తామంటే ఊరుకోం. బీఆర్ఎస్ నుంచి దూరమయ్యాక పది నెలల పాటు కవిత వేచి చూశారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిద్ర లేస్తుందో ఏమోనని వేచి చూసి… ఆ తర్వాతే పార్టీ పెట్టారు. కచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తాం..మూడేళ్లలో అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.