పార్టీ ఆవిర్భావ సభాస్థలిని పరిశీలించిన టీజే మహిళా నేతలు
(మేడ్చల్) :
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఈనెల 25న రాజకీయ పార్టీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో జాగృతి మహిళా నాయకులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మీ ఆధ్వర్యంలో పలువురు మహిళా నాయకులు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో సభ ఏర్పాట్లపై నిర్వహకులతో సమీక్షించారు. తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే జాగృతి క్యాడర్, వాహనాల పార్కింగ్.. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆరా తీశారు. పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జాగృతి నాయకులు పడాల మనోజా గౌడ్, మేక లలితా యాదవ్, కేఆర్ ధరణి, టి. సంధ్యారెడ్డి, బండారి లావణ్య, దేశపాక సుచిత్ర, అనుముల స్వప్న, శాంత, జె. స్వప్న తదితరులు ఉన్నారు.








