అమీర్ పేటలో కవిత పర్యటన
అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ
ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని కవితకు వివరించిన బాధితులు
(అమీర్ పేట, హైదరాబాద్)
అమీర్ పేట్ లో జరిగిన అగ్నిప్రమాదం సడెన్ గా జరిగింది కాదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అమీర్ పేట్ లో అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ మాల్ ను శుక్రవారం పరిశీలించి బాధితులను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెనుక వైపు ఉన్న మెస్ కారణంగా గతంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెబుతున్నారన్నారు. అగ్ని ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని మూడు నెలలుగా అధికారులకు చెబుతూనే ఉన్నారని వివరించారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగిందని కవిత తెలిపారు. ప్రమాదం జరిగిన గంటం పావు వరకు కూడా ఫైరింజన్లు రాకపోవటం దారుణమన్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేయాలన్నారు. సరైన సమయానికి ఫైరింజన్లు వచ్చి ఉంటే ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేదని అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగిన షాపుల వాళ్లందరికీ కూడా ఎన్ఓసీ లు ఉన్నాయని తెలిపారు. వాళ్లందరికీ నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హైడ్రా వాళ్లు వచ్చి ఇన్ స్పెక్షన్ చేశారని చెబుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఎండకాలంలో అగ్నిప్రమాదాలు జరగకుండా చేపట్టిన చర్యల కారణంగా మంచి ఫలితాలు వచ్చాయని కవిత వివరించారు. కానీ ఇంకా సీరియస్ గా ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని, ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చని హెచ్చరించారు. కనుక అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇలాంటి బిల్డింగ్ ఉన్న చోట ఇన్ స్పెక్షన్ చేయాలని సూచించారు.

దేవ్ జీకి కవిత పరామర్శ
అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కొంపల్లిలోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దేవ్ జీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.








