ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను విలీన గ్రామాల ప్రజలు కలిశారు. కొమ్ముడోలు కళాకారులతో కలిసి గ్రామస్థులు కవితకు ఘన స్వాగతం పలికారు. విలీన గ్రామాల ప్రజలు భద్రాచలంలో నిర్వహించిన ర్యాలీలో కవిత పాల్గొన్నారు.












