తెలంగాణ సాహితీరంగ సమకాలీన పరిస్థితులపై అధ్యయనం కొనసాగిస్తున్న జాగృతి లిటరేచర్ కమిటీ సభ్యులు తానిపర్తి తిరుపతిరావు  మంగళవారం సుప్రసిద్ద  కథా, నవలా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ను కలిశారు. అశోక్ కుమార్ నాటక, సినిమా రంగంలో మాటల, పాటల రచయితగా విశేష కృషి చేశారు.  సమకాలీన సామాజిక రచయితగా, తెలంగాణ జీవితాన్ని కథలు, నవల, సినిమా రూపంలో జాతీయ స్థాయిలో విస్తరింపజేసిన అస్థిత్వ రచయిత ఆయన. ఆయన రాసిన జిగిరి నవల పదకొండు భారతీయ భాషల్లోకి అనువదింపబడింది ! త్వరలో సినిమాగా కూడా రాబోతున్నది ! ఆయన రాసిన తెగారం నాటకం వంద యాభై ఏండ్ల నాటక రచనల్లో ఉత్తమంగా నిలిచింది ! కన్నడ , మరాటి , ఇంగ్లీష్ , పంజాబీ భాషల్లోకి ఆయన కథలు అనువదింపబడ్డాయి !  ఆయన పి హెడి చేయకముందే  ఆయన రాసిన సాహిత్యం మీద ఆరు పి హె డిలు , ఎనిమిది ఎంఫిల్ లు వచ్చాయి ! అయన పీహెచ్డీ లో ఆయన రాసిన నవల పై ఆయన్నే ప్రశ్నలు అడగడం సాహిత్య చరిత్రలో అరుదైన విశయం ! ఉభయ రాష్ట్రాలలో ఉండే యూనివర్సిటీల్లో   ఆయన రాసిన కథలను పాఠ్యాంశాలుగా బోదిస్తున్నారు ! 350 కథలు , 12 కథా సంపుటాలు  , 5 నాటికలు , 7 నవలలు 100 కు పైగా వ్యాసాలు , 10 కి  పైగా సినిమాలు , 20 లగు చిత్రాలకు రచనలు అందించారు ! ఇంత వరకు  ముప్పై అవార్డులు , అరవై రివార్డులు అందుకున్నారు ! తెలంగాణ బ్రతుకు చిత్రం పై లోతైన అవగాన ఉన్న పెద్దింటి ఈ రోజు హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళుతున్న క్రమం లో వారిని మా ఇంటికి ఆహ్వానించిన ! తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న దశ లో పలు సామాజిక , సాంఘీక అంశాలపై ఆయనతో తిరుపతిరావు చర్చించారు. అనంతరం అశోక్ కుమార్ తాను ఇటీవలే రాసిన కొత్త బుక్కు విత్తనం ను తిరుపతిరావుకు బహుకరించిండ్రు !!